జగన్ రెడ్డికి బిగ్ బిగ్ షాక్
posted on Mar 23, 2023 @ 8:31PM
దెబ్బ మీద దెబ్బ.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ ..బిగ్ షాక్. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం సాధించారు. నలుగురు తెలుగు దేశం ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకుని, అత్యాశకు వెళ్ళిన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పరాభవం తప్పలేదు.
తెలుగు దేశం పార్టీ టికెట్ పై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి వైసేపీలో వైపు వెళ్ళారు. ఆ విధంగా తెలుగు దేశం పార్టీకి 19 ఎమ్మెల్యేలే మిగిలారు. మొత్తం ఏడు స్థానలకు ఎన్నికలు జరిగాయి. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉండడంతో ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలి అంటే 22 ఓట్లు అవసరమవుతాయి. ఆ లెక్కన జగన్ రెడ్డి కేవలం 19 ఓట్లే ఉన్న టీడీపీ అభ్యర్హ్ది అనురాధనును సునాయాసంగా ఓడించగలమనే లెక్కలు వేసుకుని ఏడుగురు అభ్యర్ధులను బరిలో దింపారు. అయితే, జగన్ రెడ్డి ఒకటి తలిస్తే, దేవుడు మరో స్ర్కిప్టు రాశాడో ఏమో, అధి కార పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి, అనురాధను గెలిపించారు.
నిజానికి, వైసేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇది కోలుకోలేని దెబ్బగానే పరిశీలకు భావిస్తున్నారు. నిన్న గాక మొన్నపట్టా భద్రులు గట్టి మొట్టి కాయలు వేశారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడుకు మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు విజయం సాధించారు. చివరకు జగన్ రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందులలోనూ పట్టభద్రులు ఆయన్ని చిత్తుగా ఓడించారు. ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోక ముందే సొంత ఆపార్టీ ఎమ్మెల్యేలే జగన్ రెడ్డి ని గట్టి దెబ్బ తీశారు. నిజానికి అధికార పార్టీలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా వుంది..అందుకే నలుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటే నిదర్శనం.
నిజానికి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ రెడ్డి అన్ని జగ్రత్తలూ తీసుకున్నారు. క్యాంపులు నిర్వహించారు. ఎమ్మెల్యేల పై నిఘా పెట్టారు. హెచ్చరికలు చేశారు. అయినా అవేమీ ఫలించలేదు. విజయం తెలుగుదేశం పార్టీనే వరించింది. అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం ఎదురైన క్షణం నుంచే జగన్ రెడ్డిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా పరాభవం తప్పదన్న దిగులు మొదలైందని చెప్పాలి.
ఇద్దరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఆత్మ ప్రబోధం మేరకే ఓటేస్తామని ప్రకటించేశారు. దాంతో మిగిలిన ఎమ్మెల్యేలలో ఆత్మప్రభోదానుసారం ఓటేసేవారింకెంత మంది ఉన్నారో అన్న గుబులు మొదలైందని చెప్పాలి. అందుకే ఆయన పట్టభద్రుల మొట్టికాయల తరువాత నుంచీ తన నీడను చూసి తానే భయపడే పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం కోల్పోయి నిఘా పెట్టారు. నాలుగేళ్లుగా ఎన్నడూ లేనిది ఆయనే స్వయంగా ఫోన్ చేసి మరీ బుజ్జగింపు మాటలు మాట్లాడారు. స్టార్ హోటళ్లలో క్యాంపులు ఏర్పాటు చేసి సకల మర్యాదలూ చేశారు. అయినా దెబ్బ తిన్నారు. చివరికి ఆయన భయమే నిజమైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలలో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారని తేలిపోయింది.