పోలీసుల అదుపులో సెక్సీతార భువనేశ్వరి
posted on Nov 28, 2012 @ 12:56PM
తప్పతాగి చెన్నైలో సినిమా థియేటర్ ముందు తైతక్కలాడి ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో తెలుగు, తమిళ సెక్సీనటి భువనేశ్వరి అరెస్టైంది. ఈగంబాక్కంలో ఓ థియేటర్ ముందు జరిగిన గొడవలో భువనేశ్వరి అనుచరులు ఓ వ్యక్తిమీద దాడిచేసి గాయపరిచారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్ని వలేసి గాలించి పట్టుకున్నారు.
తనని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న భువనేశ్వరి చల్లగా బెంగళూరు చెక్కేసే ప్రయత్నం చేసింది. అనుచురుల్ని పట్టుకుని రాచమర్యాదలు చేసే సరికి అమ్మగారి వేసిన అసలు ప్లాన్ గురించిన సమాచారం బైటికి కక్కేశారు. అప్రమత్తమైన పోలీసులు హైవే విభాగానికి సమాచారం అందించారు.
అంటూరు సమీపంలోని కన్నికాపురం దగ్గర భువనేశ్వరిని పోలీసులు అడ్డగించినప్పుడు సినేమాకతలు చెప్పి తప్పించుకోవాలని చూసింది. తాను భువనేశ్వరిని కాదని, తన పేరు శివానీ అని.. మెలికలు తిరుగుతూ వేసిన వేషాలు పోలీసుల దగ్గర పారలేదు. మర్యాదగా చెబితే వినవా.. అంటూ లాక్కెళ్లి లాకప్ లో పడేసేసరికి నిజం ఒప్పుకోక తప్పలేదు.