భూమా శోభానాగిరెడ్డి కుమారుడి కారులో మంటలు
posted on May 14, 2014 @ 7:08PM
భూమా శోభానాగిరెడ్డి కుమారుడి కారులో మంటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్ళగడ్డ మాజీ శాసనసభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన సంఘటనను తెలుగు ప్రజలు మరచిపోలేకపోతున్నారు. తల్లి కారు ప్రమాదంలో మరణించిన విషాదం నుంచి భూమా శోభా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే విఖ్యాత్ రెడ్డి కూడా ఒక కారు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో విఖ్యాత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కలుగకపోవడం అదృష్టం. బుధవారం నాడు హైదరాబాద్‌లోని బేగంపేటలో విఖ్యాత్ రెడ్డి తన కారులో ప్రయాణిస్తూ వుండగా, కారు ఇంజన్‌లోంచి అకస్మాత్తుగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన విఖ్యాత్ రెడ్డి వెంటనే కారులోచి దిగిపోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారు ఇంజన్‌లో భారీగా రేగిన మంటల కారణంగా కారు బాయ్‌నెట్, కారు లోపలి భాగాలు కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు మంటలను అదుపులోకి తెచ్చారు.