రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బండి సంజయ్
posted on Apr 15, 2023 @ 5:52PM
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అధిష్టానం అక్కున చేర్చుకుంటుంది. శనివారం రాజాసింగ్ జన్మదినోత్సవం. అయితే తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. మహమ్మద్ ప్రవక్త మీద వివాదా స్పద వీడియో విడుదల చేసిన రాజాసింగ్ పై పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ప్రవక్త మీద వివాదా స్పద ప్రకటన చేసిన నుపుర్ శర్మతో పాటు రాజాసింగ్ పై సీరియస్ అయ్యింది.
హైదరాబాద్ నుంచి ఎన్నికైన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనమైంది. బిజేపీ శ్రేణులు నొచ్చుకున్నాయి. రాజాసింగ్ బహిరంగ ప్రదేశాల్లో ప్రసంగించకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కేసులో రాజాసింగ్ కు కోర్టు రిమాండ్ విధించింది. పార్టీ అధిష్టానానికి కూడా రాజా సింగ్ దూరంగా ఉన్నారు. పార్టీ అగ్రనేతలు రాజాసింగ్ ను కలవకుండా దూరం పాటించారు.
శనివారం బర్త్ డే విషెస్ ను సోషల్ మీడియా ద్వారా బండి సంజయ్ వ్యక్తం చేయడంతో సస్పెన్షన్ ఉపసంహరణ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచనాప్రాయంగా పేర్కొన్నాయి. రాజాసింగ్ సేవలు వినియోగించుకోవడానికే బండి సంజయ్ బర్త్ డే విషెస్ చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం అనుమతితో బండి సంజయ్ రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పినట్లు అర్థమౌతుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.