బాలయ్యను మించిన సైకియాట్రిస్ట్ లేడు!
posted on Apr 10, 2023 @ 10:26AM
తాను సైకాలజీ చదవకపోయినప్పటికీ, తనను మించిన సైక్రియాటిస్టు లేడంటున్నారు నందమూరి నటసింహం, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎవరేమనుకున్నా తాను మాత్రం వాస్తవాలు మాట్లాడతానని అంటున్నారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలి ఇందుకోసం యువత అప్రమత్తంగా ఉండాలి. వారిని జాగృతం చేసేందుకే యువ గళం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలంలో నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని బాలయ్య చెప్పారు.
వైసీపీ పట్ల వ్యతిరేకత, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం మౌతోందన్నారు. యువతరం పాదయాత్రకు అన్ని వర్గాలు నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. బడ్జెట్ లో రూ.17 లక్షల కోట్ల అని కాకి లెక్కలు చూపించిందని విమర్శించారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. అందరూ కంకణబద్దులై వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిం చాలని బాలకృష్ణ పిలుపు నిచ్చారు.
రాష్ట్రంలో చట్ట వ్యతిరేక చట్ట నడుస్తుంద న్నారు. పోలవరం పూర్తి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఈ నాలుగేళ్లలో ఊసే ఎత్తలేదన్నారు. పెన్షనర్లు నెలనెలా పెన్షన్ రాక బాధలు పడుతున్నారన్నారు. విద్యుత్, డీజల్, చెత్త ఇలా అన్నిటిపైనా పన్నులు పెంచేసి జగన్ సర్కార్ ప్రజల నడ్డి విరుస్తున్నదని బాలయ్య విమర్శించారు. సైకో మళ్లీ అధికారం లోకి వస్తే జనం రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుందని హెచ్చరించారు. హత్యా రాజకీయాల్లో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉందన్నారు. ఇన్ని రోజులు.. ఆయనలో నటుడు ఉన్న విషయం మనందరకీ తెలుసు.. అయితే తనలో ఓ సైక్రియాటిస్ట్ కూడా ఉన్నాడనే విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు.