ఎమ్మెల్యే గానే బాలయ్య పోటి
posted on Mar 23, 2013 @ 5:31PM
2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగానే పోటిచేస్తానని టిడిపి అదినేత చంద్రబాబు వియ్యంకుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా లావుకొత్తూరు మండలానికి చెందిన తునికి సమీపంలోగల తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికలలో పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను సామాన్య కార్యకర్తలాగా చేస్తానని ఆయన అన్నారు. విశాఖ జిల్లాకు చెందిన పాయకరావు పేటలో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు.