బాలకృష్ణ దెబ్బకు కొడాలి నాని గప్‌చుప్!?
posted on Jun 10, 2020 @ 11:41AM
అగ్ర హీరో, హిందూపూర్ శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ దెబ్బకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గప్‌చుప్ అయ్యారా? ఎక్కడా కనిపించడం లేదేంటి? అని సోషల్ మీడియాలో పోస్టులు దండిగా పడుతున్నాయి. ఎందుకు? కారణం ఏమిటి? తెలుసుకోవాలంటే కాలంలో కొంచెం వెనక్కి వెళదాం!
వైసీపీ ప్రభుత్వం పేదలకు రేషన్ లో సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు వరాలు గుప్పించింది. తీరా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ హామీని పక్కన పెట్టింది. దీనిపై బాధ్యత గల ప్రతిపక్షంగా తెలుగుదేశం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు, కొడాలి నానికి కోపం వచ్చింది. ఓ మీడియా సమావేశంలో నోరు జారి మాట్లాడారు. "సన్నాసి! సన్న బియ్యం ఇస్తానని చెప్పామని. ఎవడికి చెప్పాం? మీ అమ్మా మొగుడికి వచ్చి చెప్పానా? సన్నబియ్యం ఇస్తానని?" అని పద్దతి లేకుండా మాట్లాడారు.
కట్ చేస్తే... నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా టీజర్ విడుదలైంది. అందులో 'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. 'శ్రీనుగారూ... మీ నాన్నగారు బాగున్నారా?' అనే దానికి, 'శ్రీనుగారూ మీ అమ్మామొగుడు బాగున్నారా?' అనేదానికి చాలా తేడా ఉంది లమ్డీ కొడకా'' అని బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. ఈ కౌంటర్ కొడాలి నానికి అని ట్విట్టర్ టాక్. ఆల్రెడీ కొడాలి నాని మాటలను, తర్వాత బాలకృష్ణ వార్నింగ్ ఇస్తున్న డైలాగ్ ఎడిట్ చేసి వీడియో వదిలారు.