బాద్ షా మొదటివారం కలెక్షన్స్
posted on Apr 12, 2013 @ 8:01PM
యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా విడుదలయి అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ సినిమాకి టికెట్స్ దొరకని పరిస్థితి. ఏ సినిమా హాలు ముందు చూసినా హౌస్ ఫుల్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. సినిమా టాక్ విని దియేటర్లకి వస్తున్న ఫామిలీ ఆడియన్స్ ని హౌస్ ఫుల్ బోర్డులు వెక్కిరిస్తుండటంతో కొంచెం అసహనంగా మరో సినిమాకి వెళ్ళక తప్పట్లేదు. ఈ ఊపు కనీసం మరో రెండువారాల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని దియేటర్ల యజమానులు చెపుతున్నారు. మొదటి వారం కలెక్షన్ వివరాలు:
|
నైజాం |
8.04 కోట్లు |
|
సీడెడ్ |
5.45 కోట్లు |
|
కృష్ణా |
1.69 కోట్లు |
|
గుంటూరు |
2.70 కోట్లు |
|
నెల్లూరు |
1.13 కోట్లు |
|
తూర్పు గోదావరి |
1.81 కోట్లు |
|
పశ్చిమ గోదావరి |
1.51 కోట్లు |
|
ఉత్తరాంధ్ర |
2.43 కోట్లు |
|
కర్ణాటక |
2.75 కోట్లు |
|
దేశంలో మిగిలిన ప్రాంతాలలో |
0.70 కోట్లు |
|
విదేశాలలో |
5.90 కోట్లు |
|
మొత్తం కలెక్షన్స్ |
34.11 కోట్లు |