పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా? .. చంద్రబాబు
posted on Jun 24, 2022 @ 12:42PM
అధికారంలోకి రాగానే ఏదో శక్తి ఆవహిస్తుందేమో చాలామంది చాలా అతిగా వ్యవహరిస్తుంటారు. కొందరు మరీ దారుణంగానూ వ్యవహరిస్తుంటారు. ఈ దారుణానికి అడ్డూ ఆపూ లేకుండానూ పోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సి.ఎం జగన్ పాలనలో ఇది అడుగడుగునా బయటపడుతోంది. ఎవరు రోడ్డెక్కి ప్రభుత్వ వ్యతిరేతను చాటినా, నినాదాలతో హోరెత్తినా భరించలేకపోతున్నారు పాలకులు. ఎవరు ధర్నా చేస్తున్నా, భారీ ప్రదర్శనలు చేస్తున్నా వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో విరుచుకుపడటం చూస్తు న్నాం.
పోలీసుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఓవరాక్షన్‌ను అడ్డుకోవడానికి వచ్చిన చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత మీదకి పోలీసు జీపు ఎక్కించడం కంటే దారుణం మరోటి వుండదన్నారు. మహిళ అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యం? ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారు? ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
అసలు పోలీసుల్లా కాకుండా వైసీపీ కార్య కర్తల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ రకమైన పోలీసుల దారుణ వైఖరి ఈమధ్య కాలంలో పెచ్చుమీరుతోందని చంద్రబాబు ట్విటర్ లో ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల్లా మారి గాడి తప్పిన పోలీసు అధికారులను వదిలేది లేదని అన్నారు. జగన్ రెడ్డి దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చ ర్యంగా ఉంది. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్ట డంలో అర్థం ఏమిటి? నేరస్తులను కాపాడుతున్నారా? పోలీసులే పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గమన్నారు.
వైసీపీ కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తి లేదు. పార్టీ తరపున న్యాయపోరా టం చేస్తాం. రేపు మేము అధికారంలోకి వచ్చాక గాడితప్పిన ప్రతి అధికారి పై చర్యలు తీసుకుంటామ న్నారు.