చీటర్ అవినాష్ లొంగుబాటు
posted on Mar 12, 2015 @ 2:29PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్ప బంధువునని చెప్పి పలు మోసాలకు పాల్పడిన అవినాష్ పోలీసులకు లొంగిపోయాడు. వివరాల ప్రకారం పేరాబత్తుల అవినాష్ దేవ్ చంద్ర తాను చినరాజప్ప బంధువునని పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన వారిపై దాడికి పాల్పడి, అనేక చిత్రహింసలకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో అవినాష్ ను పట్టుకునేందుకు తూర్పు గోదావరిజిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే గురువారం హైదరాబాద్ లో ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చిన అవినాష్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయాడు. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారం చేసుకొని మానవ హక్కుల కమిషన్ అవినాష్ పై సుమోటోగా కేసు నమోదు చేసింది. అవినాష్ చేసిన అక్రమాలపై ఏప్రిల్ 6 లోపు నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.