బ్రాహ్మణయ్య మృతికి చంద్రబాబు నాయుడు సంతాపం
posted on Apr 21, 2013 @ 12:55PM
అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి బ్రాహ్మణయ్య ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల టిడిపి ఎంపీలు హరికృష్ణ, సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు, సినీ నటుడు బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
అంబటి బ్రాహ్మణయ్య హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తను కన్నుమూశారు. బ్రాహ్మణయ్య మృతదేహాన్ని హైదరాబాదు నుండి కృష్ణా జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఈ రోజు బ్రాహ్మణయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆయన విశాఖ నుండి విజయవాడకు బయలుదేరారు.
అంబటి బ్రాహ్మణయ్య మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో ఉన్నారు. అవనిగడ్డ సమితి అద్యక్షుడుగా మొదట ఎన్నికైన ఈయన, ఆ తర్వాత 1994లో బందరు నుంచి శాసనషభ్యుడిగా తొలిసారి గెలుపొందారు.1999 లో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. తిరిగి 2009 లో అవనిగడ్డ నుంచి శాసనసభకు గెలిచారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం అద్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.