రెండవ విడత కోవిడ్ మరణాల పై ఆడిట్.. కేంద్రానికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫారసు
posted on Sep 14, 2022 @ 3:39PM
రెండవ విడత కోవిడ్ మరణాలు, ఆక్సిజన్ కొరత పై ఆడిట్ చేయాల్సిందేనని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పని తీరు పై పార్లమెంటు స్థాయీ సంఘం కేంద్రానకి సమర్పించిన నివేదికలో ఈ మేరకు సిఫారసు చేసింది. వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పని తీరుపై స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యవసర సమయం లో సదరు మంత్రిత్వ శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సభాసంఘం ఆ నివేదికలో పేర్కొంది.
రెండవ విడత కోవిడ్ మరణాలను సమీక్షించాలని, ఆక్సిజన్ కొరత ఏర్పడిందా లేదా అన్న అంశం అలాగే మరణించిన కుటుంబాలకు, బాధితులకు అందించిన నష్ట పరిహారం పై ఆడిట్ జరగాలని సమాజ్ వాదీ పార్టీ నేత రాం గోపాల్ యాదవ్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించింది. వైద్య కుటుంబ సంక్షేమ శాఖపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమర్పించిన రిపోర్టులో కోవిడ్ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం గా మరణించారా లేదా ?అన్న అంశం పై నిజనిర్ధారణ చేయాలని సూచించింది.
ఈ మేరకు మరణించిన కుటుంబలాకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, ఆక్సిజన్ అందించడం అత్యవసర సమయం లో సకాలం లో వైద్యసహాయం అందించడం లో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని స్టాండింగ్ కమిటీ అభిప్రాయ పడింది .అసలు కోవిడ్ కారణంగా దేశంలో సంభవించిన మరణాల సంఖ్య ఎంత, ఆ మరణాలకుఆక్సిజన్ కొరత కారణమా అన్న అంశంపై ఆడిట్ అవసరమనిపేర్కొంది. వైద్య కుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలలో కోవిడ్ మరణాల పై ఆడిట్ నిర్వహించాలని వాటిని తప్పని సరిగా రికార్డు చేయాలని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ఇటువంటి ఆడిట్ ప్రభుత్వ బాద్యతగా కమిటీ పేర్కొంది. పారదర్శకత తో ప్రభుత్వ సంస్థలు జవాబుదారీ తనంతో వ్యవహరించాలని ఆక్సిజన్ కొరత ఉందా లేదా?సహజ మరణాలు ఎన్ని? కోవిడ్ కారణంగా సంభవించిన మరణాల సంఖ్య ఎంత? ఆక్సిజన్ అందక మరణించిన వారెంతమంది బాధితులకు ఇచ్చిన నష్టపరిహారం వివరాలు తెలపాలని కమిటీ కోరింది. అయితే చాలా ప్రాంతాలాలో రోగుల కుటుంబ సభ్యులు ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూ లైన్లలో నిలబడ్డ ఘటనలు ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి ఘటనలపై మీడియాలో కధనాలు వెలువడిన ఉదంతాలను ఉటంకించిన స్థాయీ సంఘం రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను తెలుపుతూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరఫరాలో జాప్యం జరిగిందని పేర్కొంది. ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాలో రిగా వ్యవహరించలేదని డిల్లి ప్రభుత్వం చేసిన ఆరోపణలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఇదే అంశం పై దిల్లి హైకోర్ట్ కేంద్రాన్ని మందలించిన విషయాన్ని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.
ఆ తరువాత వినియోగించని ఆక్సిజన్ ట్యాంకార్ల ను తిప్పి పంపిన విషయం కమిటీ తీవ్రంగా పరిగణించింది. కాగా గతం లో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను మరణించిన వారి వివరాలాను ఇవ్వాలని కోరిన విషయాన్ని కమిటీ గుర్తు చేసింది. రెండవ విడత కోవిడ్ పరిస్థితులపై, ఆక్సిజన్ కొరత పై 2౦ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలాలో పరిశీలించి నివేదికను రూపొందించినట్లుపార్లమెంటు స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది.