ఫిరోజ్ ఖాన్ పై దాడి
posted on Oct 7, 2024 @ 7:10PM
హైదరాబాద్ పాతబస్తీ ఆసిఫ్ నగర్ లో టెన్షన్ నెలకొంది. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. సీసీ రోడ్త పరిశీలనకు వెళ్లిన ఫిరోజ్ ఖాన్ ను మాజిద్ వర్గీయులు అడ్డుకున్నారు.
మాటామాటా పెరగడంతో ఎమ్మెల్యే అనుచరులు ఫిరోజ్ ఖాన్ పై దాడి చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ అధికారంలో కోల్పోయాక కాంగ్రెస్ కు దగ్గరైన మజ్లిస్ పార్టికి ఫిరోజ్ ఖాన్ కొరకరాని కొయ్యగా మారారు. తాజా ఘటన మజ్లిస్ , కాంగ్రెస్ సంబంధాలు బెడిసికొట్టినట్టేనని రుజువయ్యాయి. ఇరు వర్గాలను పోలీసులు సముదాయించి పంపించినప్పటికీ అసిఫ్ నగర్ లో నివురు గప్పిన నిప్పు మాదిరిగా తయారయ్యింది. రాత్రి వరకు ఘర్షణలు తలెత్త వచ్చని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అయితే ఇటు ఎమ్మెల్యే మాజిద్ గాని అటు ఫిరోజ్ ఖాన్ గానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం కొసమెరుపు. ఫిరోజ్ ఖాన్ పై గతంలో అనేక సార్లు మజ్లిస్ కార్యకర్తలు దాడులు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాడి జరగడం చర్చనీయాంశమైంది