ఏపీ నీ అబ్బా జాగీరు కాదు..
posted on Feb 13, 2021 @ 9:59AM
ఏపీలో ఒక వైపు ఎన్నికలు , మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ రెండు విషయాలపై ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ పై నిరంతరం శివకాశి టపాసుల బ్లాస్ట్ అవుతేనే ఉన్నారు.. అధికార పార్టీ లో మాత్రం స్టీల్ ప్లాంట్ కదలిక లేదు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికార పార్టీ నాయకుల పై విమర్శలు చేశారు..
వైసిపి నాయకులు మాత్రం సిగ్గులేకుండా స్టీల్ ప్లాంట్ విషయం మాకు తెలీదని మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఆయన శుక్రవారం కలిసి సంఘీభావం తెలుపుతూ. అచ్చన్న మాట్లాడుతూ ‘ఢిల్లీకి పదులసార్లు వెళ్లిన సీఎం రాష్ట్ర ప్రయోజనాల గురించి, స్టీల్‌ప్లాంట్ గురించి ఏనాడైనా మాట్లాడారా? ఏపీ రాష్ట్రాన్ని తన పై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికి, సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని.. ఏపీ ప్రజల మనోభావాలతో ఆటలు ఆడుతున్నడని.. అలా చెయ్యడానికి ఏపీ నీ అయ్య, తాత జాగీరు కాదని జగన్ పై అచ్ఛనాయిడు విరుచుకుపడ్డారు.. స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి జగన్ లేఖ రాశానంటున్నారని, ఆ లేఖ ఢిల్లీలో ఎవరు చూస్తారో తెలియదని వ్యంగ్యంగా మాట్లాడారు విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడానికి పూనుకున్న దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నిలదీయాలని చెప్పారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జగన్ ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగిందని. 3 లక్షల కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్‌ను రూ.20 వేల కోట్లకు కొట్టేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. 2019లో సీఎం వద్దకు విజయసాయిరెడ్డి పోస్కో ప్రతినిధులను తీసుకువెళ్లిన మాట వాస్తవమా? కాదా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘దొంగ విజయసాయిరెడ్డికి విశాఖతో ఏం పని.? ఈ ప్రాంతంలో నాయకులు లేరా..? విశాఖను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి వెంట ఎమ్మెల్యేలు, మంత్రులు పరుగులు పెడుతున్నారు. చేతకాని, దద్దమ్మ మంత్రి తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై నెపం పెడుతున్నాడు’ అని విమర్శించారు.