ఆసియాకప్ .. వారంలో మళ్లీ భారత్-పాక్ వార్
posted on Sep 3, 2022 @ 11:14AM
అంతర్జాతీయ క్రికెట్ పోటీ అనగానే యావత్ క్రికెట్ వీరాభిమానులకు గుర్తుచేసుకునే పోటీలు అతి పెద్దవి రెండే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్, రెండోది భారత్, పాకిస్తాన్ మధ్య హోరాహోరీ జరిగే మ్యాచ్లు. వీటికే ప్రేక్షకులు ఫిదా అయ్యేది. కారణం యావత్ క్రికెట్‌లో సత్తా ఉన్న ప్లేయర్లు, అస లు ఉత్తమ స్థాయి ఆట ప్రదర్శన అనేది చూసి తరించగలిగేది ఈ నాలుగు జట్ల ధనాధన్ పోటీల్లోనే. ప్రస్తు తం మనం ఆసియా కప్ పోటీలు చూసి తరిస్తున్నాం. ఆసియాకప్ 2022 లో ఇప్పటికే ఒక మ్యాచ్‌లో దాయాదులు కలబడ్డారు. మొదటి మ్యాచ్ భారత్ గెలిచింది. ఆసియా కప్‌లో ఈసారి సూపర్ 4 స్థాయికి రెండు వచ్చాయి. వారం తిరక్కుండానే మళ్లీ ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్ ఈ మ్యాచ్‌లో విజృం భించి గెలిస్తే రవ్వంత స్వల్ప స్కోర్ తేడాతో గెలిచినా, పాక్ ఓడినా మళ్లీ ఫైనల్‌కి తలపడే అవకాశా లుంటాయి. అసలు సిసలు పోటీ అప్పుడు చూడగల్గుతాం.
ఇక సూపర్ 4 మ్యాచ్‌ల్లో భాగంగా భారత్, పాక్‌లు ఆదివారం (ఆగష్టు 4)న తలపడనున్నాయి. రెండు జట్లూ మంచి పదును మీద ఉన్నాయి. రేపు జరిగే మ్యాచ్ ప్రక్షకులకు అత్యంత ఆసక్తికర, ఉత్సాహభరిత వాతావ రణంలో మ్యాచ్ రక్తికట్టించే అవకాశం ఉందని ఇప్పటికే క్రికెట్ పండితులు అంటున్నారు. అంటే ఇది సహజంగా దాయాదుల మధ్య జరిగే పోటీ కాబట్టి అంతే స్థాయిలో జరుగుతుంది, ఎక్కడ యినా. కాకుంటే షార్జాలో గనుక మరింత ఉత్సుకతను ప్రదర్శిస్తారు. ఎవరికి వారే ధీటుగా ఆడే ప్లేయర్లతో రికార్డు స్థాయి పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించవచ్చు.
భారత్‌కు విజయావకాశాలు ఉన్నాయనే అంటున్నారు. ఈ టోర్నీలోనూ కప్పును కాపాడుకుంటారన్న ధీమా కూడా వీరాభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కారణం పాక్ జట్టులో అరవీరభయంకర లెఫ్టార్మ్ పేసర్ షాహీన్ ఈ టోర్నీకి జట్టులోకి ఎంపిక కాలేదు. అతని మోకాటి గాయం కారణంగా అతన్ని జట్టులోకి తీసుకోలేదు. వాస్తవానికి అతను ఇటీవల భారత్ బ్యాటర్లకు పెద్ద పరీక్షపెట్టేడు. అచ్చం వాసిం అక్రమ్ స్థాయి స్వింగ్‌తో బ్యాటర్లకు దడపుట్టించేడు.
కుర్రాడు, పొడుగ్గా వుండి పరుగున వచ్చి బంతిని మహా తెలివిగా స్వింగ్ చేస్తుంటే బ్యాటర్లు బెంబేలెత్తక పోరు. ఆ అనుభవం మన వాళ్లకి కొంత దక్కింది. అతను వస్తే ఈ టోర్నీలో మరింత గట్టి పోటీ ఉండేది. కానీ మనవారికి అదృ ష్టం, పాక్‌కు దురదృష్టం అతను మోకాటి గాయంతో ఇంటికి పరిమితం అయ్యాడు. అయినప్పటికీ వారి బౌలింగ్ విభాగాన్ని తక్కువగా చూడాల్సినదేమీ లేదు. పాక్‌కి మొహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ ఉన్నా రు. వారి ధాటిని ఎదుర్కొనడంలో కాస్తంత జాగ్రత్తగా బ్యాట్ చేయవలసి వస్తుంది. శుక్రవారం మ్యాచ్ అంత కు ముందు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్ బౌలర్లు మంచి నైపుణ్యాన్నే ప్రదర్శించారు.
అలాగే పాక్‌ను ఇబ్బందిపెట్టగలిగిన మన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఇక టోర్నీ లో ఆడడు. అతను కూడా మోచేతి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వచ్చాడు. అయితే జడేజా ఫీల్డర్‌గా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సూపర్ ప్లేయర్. మెరుపువేగంతో బంతిని ఆపడం, వికెట్లు పడగొట్టడంలో ఏ గొప్ప అంతర్జాతీయ ప్లేయర్‌కీ తీసిపోడని పాక్ మాజీలు కూడా అంగీకరించారు. అతని వేగం ముందు బ్యాటర్లు బహు జాగ్రత్తగానే ఉంటారు. అంతటివాడు ఏకంగా ఇపుడు ఏకంగా టోర్నీకి గాయం కారణంగా దూరం కావలసి వచ్చింది. అలాగని అక్షర్ పటేల్ తక్కువేమీ కాదు.
పోతే ఆసియా కప్ టోర్నీల్లో ఇప్పటివరకూ భారత్ , పాక్‌లు 16 మ్యాచ్‌ల్లో ఢీకొంటే భారత్ 9 మ్యాచ్‌లు, పాకిస్తాన్ 5 మ్యాచ్‌లు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు రాలేదు. అంటే ఒకటి టై కాగా, మరొకటి ఫలతం తేలకుండానే ముగిసింది. ఆసియాకప్‌లో భారత్ విజయాలు 67.27 శాతం మేరకు ఉంది. కాగా మొత్తం మీద ఆసియా క్రికెట్ టోర్నీల్లో జరిగిన 50 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 28 మ్యాచ్‌లు గెలచింది. అంటే ఇక్కడి పిచ్‌ల మీద వారికి సంపూర్ణ ఆధిపత్యం ఉందనే అంగీకరించాలి.
ఈ లెక్కలు, సత్తాల పరంగా చూసుకుంటే రేపటి అంటే ఆదివారం ఆగష్టు 4వ తేదీ మ్యాచ్ రెండు సింహాలు ఢీకొన్న స్థాయిలో జరిగే అవకాశాలే ఉన్నాయి. ఇరు దేశాల క్రికెట్ వీరాభిమానులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారూ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఇలాంటి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఉత్కంఠతకు ఆలవాలమయ్యే మ్యాచ్ చూడటానికి మరింత సమయం పడుతుంది. జయహో భారత్!