కేజ్రీవాల్ కీ రాఖీసావంత్ కీ లింకు
posted on Nov 12, 2012 @ 10:18AM
ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్త కేజ్రీవాల్ కి, ఐటెం గర్ల్ రాఖీ సావంత్ కీ లింకు పెట్టేశారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. రాఖీ ఎప్పటికప్పుడు తన పేరు హైలైట్ అయ్యేలా తనకి తానుగా వివాదాలు సృష్టించుకుని ఎప్పుడూ వార్తల్లో నిలబడే ప్రయత్నం చేస్తుందని, ప్రస్తుతం కేజ్రీవాల్ వ్యవహారం కూడా అలాగే ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు.
కేవలం ప్రచారం కోసం కేజ్రీవాల్ రాజకీయ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్ప, ఆయన ఆరోపణల్లో పస లేనేలేదని దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేస్తున్నారు. రాఖీ సావంత్ కూడా అచ్చం ఇలాగే ప్రచారంకోసం పాకులాడుతుందని, ఇద్దరిమధ్యా చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యాఖ్యలవల్ల రాఖీ హర్టయితే తనకి ఏకిపారేస్తుందన్న ఆలోచన వచ్చిందేమో మళ్లీ దిగ్విజయ్ సింగ్ తాను చేసిన వ్యాఖ్యలపై నాలిక్కరుచుకున్నారు. కేజ్రీని రాఖీతో పోల్చాల్సి రావడం దురదృష్టకరమంటూ ఆమెకి క్షమాపణకూడా చెప్పారు. రాఖీకి నేను వీరాభిమానిని అంటూ 65ఏళ్ల వయసున్న దిగ్విజయ్ ట్వీట్ చేయడం మరో విచిత్రం.
దిగ్విజయ్ తనపై అనవసరంగా కామెంట్ చేశారని, అసలు తనకి కేజ్రీవాల్ కి దిగ్విజయ్ కి సంబంధం ఏంటో చెప్పాలని రాఖీసావంత్ మండిపడింది. దిగ్విజయ్ కోసం ఇప్పుడు కొత్తగా తనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ రీ ట్వీట్ చేసి రిటార్డ్ ఇచ్చింది.