బిఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ కిడ్నాప్ కలకలం
posted on Mar 13, 2024 @ 4:28PM
వర్దన్న పేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కిడ్నాప్ కు గురయ్యాడా? స్వచ్చందంగానే హైదరాబాద్ నందినగర్ లో కేసీఆర్ నివాసానికి తీసుకురావడానికి బిఆర్ఎస్ నేతలు ప్రయత్నించారా? వంటి ప్రశ్నలు తెలంగాణాలో హాట్ టాపిక్ అయ్యింది. బిఆర్ఎస్ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్యలు అరూరి రమేష్ ను వరంగల్ లో ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎర్రబెల్లి, బసవరాజు సారయ్య ఎంట్రీ ఇచ్చారు ఆరూరి రమేష్ ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసారు. వరంగల్ ఎంపీ స్థానం కోసం ఆయన పోటీ పడుతున్నారని మరో బిఆర్ఎస్ నేత, మాజీమంత్రి కడియం శ్రీహరి కూతురు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అరూరి రమేష్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఆరూరి రమేష్ పార్టీ మారకుండా కెసీఆర్ ఆదేశం మేరకు ఈ డ్రామా జరిగినట్టు పొలిటికల్ సర్కిల్స్ లోచర్చ జరుగుతుంది.
లీడర్లు పార్టీ మారకుండా ఆపడంలో బీఆర్ఎస్ కొత్త మార్గాన్ని అన్వేషించింది. గత బిఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన కెసీఆర్ అరూరి రమేష్ ప్రెస్ మీట్ ను ఫెయిల్ చేసి తమ వెంట తీసుకెళ్లిపోయారు. హరీష్ రావు వచ్చే వరకూ పార్టీ మారే ప్రకటన చేయవద్దని ఆరూరి రమేష్‌పై ఒత్తిడి చేస్తున్నారు.
ఆరూరి రమేష్ బీజేపీ తరపున వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే రెడీ అయిపోయారు.
ఆరూరి రమేష్‌ను కిడ్నాప్ చేశారంటూ మధ్యలో బీజేపీ కార్యకర్తలు వారి కారును అడ్డుకున్నారు. ఆయనను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కిషన్ రెడ్డి ఫోన్ చేయడంతో తనను ఎవరూ కిడ్నాప్ చేయడం లేదని .. మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు.
ఆరూరి రమేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారకుండా చేయాలని బీఆర్ఎస్.. తమ పార్టీ తరపున వరంగల్ నుంచి నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ హైడ్రామాను ఆరూరి రమేష్ తెరదించారు. తన పార్టీ కార్యకర్తలతో సమావేశం జరుగుతున్న సమయంలో దయాకర్ రావ్, బసవరాజు సారయ్య వచ్చినట్లు అంగీకరించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. బిఆర్ఎస్ లో కొనసాగుతానన్నారు.