హెలికాప్టర్ ప్రమాదంలో బతికింది ఇతనొక్కడే..
posted on Dec 8, 2021 @ 8:56PM
తమిళనాడులో జరిగిన సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఊటీ సమీపంలో ఈ మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కూనూరులో కుప్పకూలింది. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే కూలిపోయింది.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్, ఆర్మీ అధికారులు, రావత్ కుటుంబ సభ్యులు సహా మొత్తం 14 మంది ప్రయాణించారు. ఇందులో 13 మంది స్పాట్ లోనే చనిపోయారు. చనిపోయిన వారిలో జనరల్ బిపిన్ రావత్ భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్ధర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్‌నాయక్ వివేక్ కుమార్, లాన్స్‌నాయక్ బి. సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు.
తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన అతను వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చింది. వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని తేల్చారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనలో సజీవంగా నిలిచిన ఒకే ఒక్కడుగా కెప్టెన్ వరుణ్ సింగ్ నిలిచాడు.