ఏపీలో మళ్లీ బస్ ఛార్జీల వడ్డింపుః మండిపడుతున్న ప్రయాణీకులు
posted on Jul 1, 2022 @ 5:00PM
ఏపీలో క్రమేపీ బస్ ప్రయాణాలు కడు భారమవుతున్నాయి. ఏదో ఒక సాకుతో జగన్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందిపెడుతోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మిగతా విషయాల కంటే ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరీ రెండున్నర నెలల వ్యవధిలోనే పెంచడం దారుణమని అంటున్నారు. ప్రభుత్వోద్యోగులు, చిన్న వ్యాపారులు, వేరే ప్రాంతాల్లో పనులకు వెళ్లవారంతా ఎక్కువగా బస్సు లపైనే ఆధారపడుతున్నారు. పైగా కరోనా భయం వీడి ఇపుడిపుడే తిరుగుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయం అమలుకు కంకణం కట్టుకోవడం మీద ప్రజలు మండిపడుతున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ రెండున్నర నెలల వ్యవధిలో మళ్లీ ఛార్జీలు పెంచింది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులపై ఏటా 500 కోట్ల రూపాయల భారం పడనుంది. డీజిల్ సెస్ పేరిట గత ఏప్రిల్ 14న ఛార్జీలు పెంచేసిన ఏపీఎస్సా ర్టీసీ యాజమాన్యం అదే సాకుతో మరోసారి టికెట్ ఛార్జీలు పెంచడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవు తోంది. జులై ఒకటి, శుక్రవారం నుంచే పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. గురువారం ఏపీ ఆర్టీసీ చైర్మన్ ఎ. మల్లికార్జున రెడ్డి, ఎం.డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు విలేక రులతో మాట్లాడుతూ టికెట్ పై డీజిల్ సెస్ పెంచడం ముడిచమురు ధరలు ఆకాశాన్నంటడంతో చేపడు తున్నట్టు తెలిపారు.
ఏపీఎస్సార్టీసీ ప్రయాణికులపై గరిష్టంగా దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సు ఛార్జీని 90 రూపాయలు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో 120 రూపాయలు, ఏసీ బస్సుల్లో 140 రూపాయలు పెంచేసింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సు సర్వీసుల్లో గరిష్టంగా 20 నుంచి 25 రూపాయల వరకు ఛార్జీలు పెంచింది. గుడ్డిలో మెల్లలా విజయవాడ, విశాఖ నగరాల్లో సిటీ బస్సులకు మాత్రం డీజిల్ సెస్ బాదుడు నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం.
ఒక్కో టికెట్‌పై డీజిల్ సెస్ పెంపును శ్లాబ్ విధానంలో అమలు చేయనున్నారు. వాస్తవానికి, ఏప్రిల్ 13న ఆర్టీసీ డీజిల్ సెస్‌ను స్వల్పంగా పెంచింది. పెంపును సమర్థిస్తూ ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ, డిసెం బర్ 11, 2019 న బస్సు ఛార్జీని సవరించినప్పుడు, లీటరు డీజిల్ ధర రూ. 67 , ఆ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 13న చివరిసారిగా సవరించిన ఛార్జీలు రూ. 107, అంటే లీటరుకు రూ. 40 పెరిగింది. జూన్ 29 నాటి కి డీజిల్ (బల్క్) ధర లీటర్‌కు రూ.131కి పెరగడంతో, డీజిల్ సెస్‌ను స్వల్పంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణ యించింది. డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీకి రోజుకు రూ.2.5 కోట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.
అంతేకాకుండా, విడిభాగాల ధరలు, లూబ్రికెంట్లు, ఇతర ఖర్చులు కూడా పెరిగాయి, యాజమా న్యం సెస్‌ను పెంచవలసి వచ్చింది, వారు ఈ భయంకరమైన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్టీసీకి సహక రించాలని వారు కోరారు. డీజిల్ సెస్ పెంపుతో రోడ్డు రవాణా సంస్థకు రూ.1500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే, డీజిల్ సెస్‌ను పెంచినా, ఆర్టీసీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకోలేకపోయిందని వారు తెలిపారు.