జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టిడిపి దూకుడు
posted on Jul 5, 2014 @ 5:07PM
ఆంధ్రప్రదేశ్ జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆపార్టీ 10జడ్పీ ఛైర్మన్లకు దక్కించుకుంది. కడప జడ్పీ ఛైర్మన్ వైఎస్ఆర్ సీపీ దక్కించుకుంది. అయితే చాలా చోట్లు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థులు టీడీపీలోకి జంప్ కావడంతో టీడీపీ ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటోంది. ప్రకాశం జిల్లాలో మాత్రం ఉత్కంఠత కొనసాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీలకు 28 అభ్యర్థుల బలం ఉంది. ఈ స్థానం పై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.
జడ్పీ ఛైర్మన్ అభ్యర్ధుల వివరాలు:
* చిత్తూరు జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా గీర్వాణి ఎంపికయ్యారు.
* అనంతపురం జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పరిటాల రవి అనుచరుడు చమన్‌ను టీడీపీ ఎంపిక చేసింది.
* కర్నూలు జెడ్పీ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్ పేరు ఖరారైంది.
* కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా గద్దె అనురాధ ఎంపికయ్యారు.
* విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా లాలం భవాని బరిలోకి దిగారు.
* పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా ముళ్లపూడి బాపిరాజు పేరు ఖరారైంది.
* విజయనగరం జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా శోభా స్వాతి ఎంపికయ్యారు.
* శ్రీకాకుళం జెడ్పీ చైర్ పర్సన్ టీ డీపీ అభ్యర్థిగా ధనలక్ష్మి పేరును ఎంపిక చేశారు.
* తూర్పుగోదావరి జెడ్పీ చైర్మన్ నామల రాంబాబును టీడీపీ ఖరారు చేసింది.
* ప్రకాశం జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా మన్నె రవీంధ్ర ఎంపికయ్యారు.
* గుంటూరు జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా షేక్ జానిమూన్ ఎంపికయ్యారు.
* కడప జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా గూడూరు రవిని వైసీపీ రంగంలోకి దింపింది.