జగనన్న రోడ్డు పథకం అదుర్స్.. జర్నీ చేస్తే కొవ్వు మటాష్..
posted on Jul 24, 2021 @ 5:25PM
పాపం ప్రభుదేవా కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాడు. మన ఏపీ రోడ్లపై తోపుడు బండి ఎక్కి వెళ్లుంటే ఇంకా సూపర్ గా డ్యాన్స్ చేసేవాడు. పాపం మనోళ్లు చాలామంది బ్లడ్ సర్క్యులేషన్ కోసం, వెయిట్ తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. మన ఏపీ రోడ్లపై జర్నీ చేస్తే దెబ్బకు కొవ్వు కరిగిపోతుంది. వర్షం పడితే ఆటోమేటిక్ గా రోడ్లపై స్విమ్మింగ్ పూల్స్ వచ్చేస్తాయి.. ఇలాంటి అద్భుతాలు ఎక్కడైనా దొరుకుతాయా చెప్పండి.. ఏపీలో తప్ప. ఇలాంటి మీమ్స్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయ్. అక్కడ తిరిగేస్తారులెండి.. అక్కడ రోడ్లుండవుగా.. ఆ రోడ్లపై గతుకులు, గుంటలు ఉండవుగా మరి.
ఎందుకో తెలియదు గాని..జగనన్న వచ్చినప్పటి నుంచి రోడ్లను పట్టించుకోవటం లేదు. పైగా రోడ్లను డెవలప్ చేయడానికి సెస్ అంటూ పెట్రోల్ లీటర్ పై రూపాయి అదనంగా వసూలు చేసుకుంటున్నాడు. హైవేలు బాగానే ఉంటాయి.. ఊళ్లలోకి వెళ్లగానే రోడ్లు మొటిమలు తెగ వచ్చేసిన టీనేజ్ పిల్లల మొహాల్లా కనపడుతున్నాయి. ఇదేమి దారుణంరా బాబూ అంటూ లోకల్ వైసీపీ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు.
ఇక వర్షాకాలం రాగానే మేకప్ కరిగిపోయిన ఆర్టిస్టుల్లా.. కాస్తో కూస్తో ఉన్న మట్టి కొట్టుకుపోయి..ఘోరంగా తయారవుతున్నాయి రోడ్లు. ఆ మధ్య పవన్ కల్యాణ్ కూడా కొడాలి నాని మీద సెటైర్ వేశాడు..మా సంగతి తర్వాత ముందు కనీసం రోజూ నువ్వు తిరిగే రోడ్డు కూడా బాగు చేయించవా.. నువ్వేం మంత్రివయ్యా అన్నాడు. అంత మాట అన్నాకూడా కొడాలి నానికి ఆవేశం రాలేదు.. రోడ్డు బాగు చేయించనే లేదు. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
విషయం ఏంటంటే.. ఎప్పుడు జైలుకెళ్తానా అని భయపడే జగనన్నకు.. జనాల అకౌంట్లో డబ్బులు వేయడానికే వచ్చేవన్నీసరిపోవటం లేదు. వాటి కోసమే అప్పులు చేయాల్సి వస్తోంది. అవి ఆపితే.. రేపు తనకు మద్దతుగా ఎవరు నిలబడతారు.. నేను లోపలికిపోయినా.. బయట రాజ్యమేలాలంటే ఎలా అనేదే ఆయన టెన్షన్. అందుకే ఆ డబ్బులు ఈ డబ్బులు అనే తేడా లేకుండా అన్నీవాటిపైపు తరలించేస్తారు. ఆఖరికి ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వటం లేదు. ఇక రోడ్లేయడానికి డబ్బులెక్కడ వస్తాయి. కనీసం నరేగా నిధులు సక్రమంగా తెచ్చుకున్నా వేసుకోవచ్చు. అదీ చేతకావటం లేదు.. పైగా వచ్చిన కాసిన్ని కూడా ఆ నవరత్నాలవైపు తిప్పేస్తున్నాడు. ఇక రోడ్లెక్కడ వేస్తారు చెప్పండి.
ఎవరు ఆ రోడ్లపై పడిపోతే ఆయనకేంటి? బండి మీద నుంచి పడి నడుం విరగ్గొట్టుకుంటే ఆయనకేంటి? యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతే మాత్రం ఆయన కేంటి? ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటూ పోతాడు.. ఓటేసినందుకు మనమంతా ఆ గతుకుల రోడ్లపైనే చితికిపోతూ ప్రయాణం చేద్దాం