ఏపీని చూసి నేర్చుకోండి.. చంద్రబాబుకి మరో ఘనత

ఇప్పటికే పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టడానికి అనువైన వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఏపీకీ రెండో స్థానం దక్కి అరుధైన ఘనత సాధించింది. మళ్లీ ఇప్పుడు ఏపీకి.. చంద్రబాబు ఖాతాలోకి మరో ఘనత దక్కింది. అదేంటంటే కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ దేశంలోని రాష్ట్రాల్లో  విద్యుత్ రంగానికి చెందిన పంపిణీ సరఫరాలపై సమీక్షించింది. దీనిలో విద్యుత్ నష్టాల తగ్గింపులోనే ఏపీ ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా మారడం గొప్ప విషయం. ఈనేపథ్యంలోనే పంపిణీ నష్టాలను తగ్గించుకోవడమెలాగో ఏపీని చూసి నేర్చుకోవాలని.. దీనికి ఏపీ ఏం పద్దతులు పాటించిందో వాటిని అధ్యయనం చేయాలని కేంద్ర ఇంధనశాఖ మంత్రి  పీయూష్ గోయల్ సూచించారని ఏపీ ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ కె.విజయానంద్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయన తరువాత అసలే ఆర్ధిక లోటులో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో.. నష్టాల తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తూనే ఉన్నారని అన్నారు. దీనిలో భాగంగానే విభజన ముందు 2010-11 లో విద్యుత్ నష్టాలు 17.05 గా ఉంటే విభజన తరువాత చంద్రబాబు హయాంలో ఆ నష్టాల తగ్గింపు 10.54 కు వచ్చిందని.. దీనివల్ల రూ.1950 కోట్లు మేర పొదుపు చేయగలిగామని అన్నారు.

అంతేకాదు ఈ నష్టాల తగ్గింపును సింగిల్ డిజిట్ కు తీసుకురావాలని చంద్రబాబు చూస్తున్నారని.. వచ్చే రెండు మూడేళ్లలో ఆదిశగా ప్రయత్నిస్తామని తెలిపారు. దీని కోసం రాబోయే కాలం లో దాదాపు రూ.27 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని..మొదటి భాగంగా రాష్ట్రానికి రూ.2400 కోట్ల ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచబ్యాంకు ముందుకు వచ్చిందని వివరించారు.

Teluguone gnews banner