సీపీఎస్ తొందరపాటు హామీ.. ఏపీ సర్కార్ ఒప్పుకోలు
posted on Sep 8, 2022 @ 11:39AM
జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ సిపీఎస్ రద్దుపై పూర్తిగా చేతులెత్తేసారు. ఆ హామీ అవగాహన లేక తొందరపడ్డామని మంత్రి బొత్సా తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్ రద్దు చేయాల్సిం దేనని ఉద్యోగసంఘాల నేతలు స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌కు ఒప్పు కునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. సీపీఎస్ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని.. జీపీ ఎస్‌లోనూ ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి బొత్స తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు సీపీఎస్ కంటే మెరుగైన జీపీఎస్ తెచ్చామని తెలిపారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓపీఎస్ అమలు చేయాలని, జీపీ ఎస్ ఒప్పుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఏపీజేఏసీ అమరా వ తి, ఏపీ సీపీఎస్ యూఎస్ సంఘాలు, ఏపీసీపీఎస్ ఈఏ సంఘాలు దూరంగా ఉన్నాయి
ఉద్యోగి బేసిక్ పే పై 33 శాతం పింఛన్ లభిస్తుందని, పదేళ్ల సర్వీస్ పూర్తయితే కనీసం రూ.10వేల పింఛన్ లభిస్తుంది. దీంతోపాటు జీపీఎస్‌లో కుటుంబ పింఛన్, ఆరోగ్యభద్రత, ప్రమాద బీమా కల్పిం చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు తెలిపారు. సీపీఎస్‌లో లేని ఈహెచ్ ఎస్‌ను జీపీఎస్‌లో చేర్చామని, తాము జీపిఎస్ కు చట్టబద్ధత కల్పిస్తామని మంత్రులు నచ్చజెప్పచూశారు. కానీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యో గ సంఘాల నేతలు నిరాకరించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, హృద య రాజు, ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు వెంకట్రామిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడుఎన్ వెంకటేశ్వర్లు, ఎస్‌టీయూ అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఏపీటీ ఎఫ్ నేత చిరంజీవులు పాల్గొన్నారు.
కాగా తమకున్న అవకాశాలు, పరిస్థితులను అనుసరించి జీపీ ఎస్‌లో మరిన్ని మార్పులు చేశామని, జీపీ ఎస్‌కు చట్టబద్దత కంటే మించి ప్రభుత్వం మరేమీ చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులకు ఉన్నంత భద్రత మరెవరికీ లేదని అన్నారు. అలాగే ఉద్యోగులపై ఉన్న కేసు లను సీఎం దృష్టికి తీసికెళ్లి సానుకూల నిర్ణయం తీసుకోగలమన్నారు. కాగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికే ఎంతో ప్రయత్నించామని పరిశీలిస్తే ఎంతో కష్టసాధ్యమనిపించి ముందుకు వెళ్లలేక పోయామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సీపీఎస్ రద్దు అనేది మా జీవన్మరణ సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయితే తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించామన్నారు. చేయగలిగేవే చెప్తానని ఎన్నికలకు ముందు జగన్ అన్నారని గుర్తు చేశారు. జీపీఎస్ గురించి తప్ప.. ఇతర అంశంపై మాట్లాడేది లేదని మంత్రులు అన్నా రని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్‌లో సీపీఎస్ రద్దు చేశారని ఉద్యోగులు తెలిపారు. ఇచ్చిన హామీని సీఎం జగన్ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేల మంది ఉద్యోగులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ ఒక్కటే మా ఏకైక డిమాం డ్‌గా పేర్కొన్నా రు. పింఛన్ అనేది భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిందని స్పష్టం చేశారు.