దయచేసి పవన్ కళ్యాణ్ తో జగన్ ను పోల్చొద్దు
posted on Aug 27, 2015 @ 12:46PM
ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ కేవలం సీఎం కుర్చీ మీద వ్యామోహంతోనే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని.. అంతేకాని ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని మండిపడ్డారు. అంతేకాదు దయచేసి పవన్ కళ్యాణ్ తో జగన్ పోల్చవద్దని.. పవన్ కళ్యాణ్ కు జగన్ కు చాలా తేడా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ రైతుల మీద ఉన్న ప్రేమతో వారి కోసం మాట్లాడుతుంటే జగన్ మాత్రం వారిని రైతులను రైచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు.
కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ కంటే ముందే భూసేకరణ విషయంలో ఏపీ రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకొని రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని.. వారి ఇష్టప్రకారమే ఇస్తే తీసుకోండని.. వారిని ఒప్పించి భూసేకరణ చేయండని చెప్పిన సంగతి తెలిసిందే. అయినా ఏ రోజూ తీరిక లేనట్టూ ఈ నెల 29 అంటే రాఖీ రోజూ ప్రత్యేక హోదాపై ధర్నాకు దిగడం జగన్ పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.