By Poll Results: YSRCP Wins 6, Leading in 9

By Poll Results: YSRCP Wins 6, Leading in 9

 

YSRC candidate, Errakota Chennakesava Reddy wins Yemmiganur constituency with 20,103 votes.

 

YSR Congress candidate, Sucharita wins Prathipadu constituency with 15000 votes.

YSR Congress won in Polavaram with 26,700 votes

YSR Congress wins Macherla

Congress wins Narsapuram Kothapalli Subbarayudu

YSR Congress wins Rayachoti

YSR Congress wins Rayadurgam



Stay tuned to teluguone.com for more updates


Teluguone gnews banner

telangana panchayat elections

పంచాయతీ పంచాయితీ!.. గ్రామాల్లో ఉద్రిక్తతలు.. విషాదాలు!

తెలంగాణలో పంచాయతీల పంచాయితీ జోరుగా ఉంది. స్థానిక ఎన్నికల సందర్బంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో రాజకీయ వేడి పెచ్చరిల్లింది. పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం రసకందాయంలో పడింది. అదలా ఉంచితే.. తెలంగాణలో   పంచాయతీ ఎన్నికల పంచాయితీ పలు గ్రామాలలో ఉద్రిక్తతలకు, మరికొన్ని గ్రామాలలో విషాదాలకూ దారి తీశాయి.  నామినేషన్ల విషయంలో తలెత్తిన విభేదాలతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, కొన్ని కుటుంబాలలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.  అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై అంటే సై అంటున్న ఉదంతాలూ  ఉన్నాయి.  నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు. ఈ విషయమై ఇంట్లో  ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన  తల్లి మందుల లక్ష్మమ్మ (40) ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. అయితే ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలోవార్డు మెంబర్‌గా నామినేషన్ వేసినందుకు భర్త మంద లించడంతో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.   

వాస్తవ వేదిక.. ప్రజాభిప్రాయాల గొంతుక

ఏపీ టు తెలంగాణ, అమలాపురం టు అమెరికా, ఆమాటకొస్తే ఈ భూమ్యాకాశాల మధ్య ఎక్కడి నుంచి ఎందాకైనా.. విషయం ఏదైనా.. వాస్తవాలను నిగ్గు తేల్చే నిఖార్సయిన వేదిక.. వాస్తవ వేదిక!  జమీన్ రైతు, తెలుగు వన్  సంయుక్త నిర్వహణలో.. జరుగుతోందీ చర్చా వేదిక. ఈ వేదిక ద్వారా అంశమేదైనా... సమాజ హితకరమైన వాడీ వేడీ చర్చ జరుగుతోంది.  జమీన్ రైతు 95 ఏళ్ల నాటి సుదీర్ఘ జర్నలిస్టిక్ అనుభవం గల పత్రిక. ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న ఏ పత్రికకూ ఈ స్థాయిలో అనుభవం లేదన్న విషయం నాటి పాఠకులకు సుపరిచితమే. నేటి కాలానికి తగ్గట్టుగా తమ వాణి వినిపిస్తున్న పత్రిక జమీన్ రైతు. ఇక తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో తెలుగు వారి మధ్య వారధిగా.. వారి వారి అభిప్రాయాలకు గొంతుకగా, వేదికగా కొనసాగుతోంది. అలాంటి తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ..మధ్య ముఖా ముఖీ.. అది సమాజ హితానికి ఓ దిక్సూచి. మార్గనిర్దేశకత్వంలో సవ్యసాచి.  ప్రస్తుతం దేశంలో ఉన్న సుప్రసిద్ధ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన వారే. అలాంటి విద్యార్ధులకు సంబంధించి ఉద్యమాలు ఎలాంటివి? అవిప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు కాలేజీ రాజకీయాల నుంచే రాజకీయాలను మొదలు పెట్టిన హుషారైన కుర్రకారుకూ నేటి యువతకూ గల తేడాలేంటి? వారి ఉడుకురక్తంతో కూడిన ఉద్యమం ఏమై పోయింది? అన్న అంశంపై రెండు భిన్న పార్శ్వాలు ఒకే వేదికపై నుంచి వినిపించే గొంతుక.. ప్రజాభిప్రాయ దీపికగా మారనుందనడంలో సందేహం లేదు. కాబట్టి విజ్ఞులైన పాఠక, ప్రేక్షకులందరూ వాస్తవ వేదిక సెకండ్ ఎడిషన్ గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం విడుదలవుతుంది … చూసి అభిప్రాయ వ్యక్తీకరణ చేయాలని ఆశిస్తూ..  మీ తెలుగు వన్, జమీన్ రైతు.

ఒక్క ఆదేశం.. నేతల తీరులో మార్పు.. చంద్రబాబు హ్యాపీ!

కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయాలలో ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు అడుగులు వేస్తున్నది. అయితే వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారంతా పెద్దగా ప్రజల మధ్యకు రావడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు. ఇది ఎవరో ప్రత్యర్థులు చెబుతున్న మాట కాదు. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో పలు మార్లు చెప్పిన మాట. ఈ విషయంలో ఆయన తన అసంతృప్తిని ఇసుమంతైనా దాచుకోలేదు. బాహాటంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పద్ధతి మార్చుకోవాలని ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నాయ‌కులు పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు కూడా.  ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు.  అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు. చంద్రబాబు చెప్పారు, ఇక తప్పదన్నట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ప్రజలతో  మమేకం కావడం లేదు. అదేదో తమకు సంబంధించని ఓ ప్రభుత్వ కార్యక్రమంలా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ స్పష్టమైన ఆదేశం జారీ చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇంతకీ ఆ ఆదేశం ఏమిటంటే..  పింఛ‌న్లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలు దిగి వాటిని పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేయాలి. కార్యక్రమం ప్రారంభం, ముగింపు ఇలా రెండు సమయాల్లోనూ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులుఫొటోలు దిగాలనీ,  వాటిని పార్టీ ఆఫీస్ వెబ్ సైట్ లో పోస్టు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంత కాలం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్న వారూ, మొత్తానికే డుమ్మా కొట్టేస్తున్న వారూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో సోమవారం (డిసెంబర్ 1)న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 90శాతం మంది పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు.. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ప్రజలలో మమేకం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేశారు. దీంతో పార్టీ కార్యాలయ సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న వివరాలను గణాంకాలతో సహా చంద్రబాబుకు నివేదించారు. ఈ గణాంకాల ప్రకారం తాజాగా జరిగిన  ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్యక్రమంలో  90 శాతం మంది నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. నేతలలో వచ్చిన మార్పు ను స్వాగతించారు. మిగిలిన పది శాతం మంది కూడా ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో వంద శాతం నాయకులు పాల్గొనాలనీ సూచించారు. 

ఐదు లక్షల బీమా...పెళ్లికి పుస్తే మెట్టెలు సర్పంచ్ అభ్యర్థి వరాలు

  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తులు అనేక హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడు తున్నారు. ఇంటింటికి ఐదు లక్షల బీమా, అమ్మాయి పెళ్లికి పుస్తే మెట్టెలు, ఉచిత అంబులెన్స్ అంటూ గ్రామ ప్రజలకు పోటాపోటీగా ఇలా రకరకాల హామీలు ఇస్తున్నారు... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే అభ్యర్థి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఆ గ్రామంలో 700 ఇండ్లు ఉండగా, ప్రతీ ఇంటికి ఏడాదికి రూ.1200 ప్రీమియం కడితే, ఏడాదికి రూ.8.40 లక్షలు, ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అవుతుందని గ్రామస్తులు తెలిపారు. అందుకు వనమ్మ నరసింహ యాదవ్ ఒప్పుకోవడమే కాకుండా ఈ హామీతో పాటు తన మ్యానిఫెస్టోలో మొత్తం 15 హామీలు ప్రకటించాడు. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని, ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహణ, శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి రూ.15వేల ఆర్థికసాయం, ఇల్లు కట్టుకునేవారికి స్లాబ్ వేసుకునే సమయంలో రూ.21వేలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ, ఉన్నత చదువులకు ఆర్ధిక సాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు  శివరాత్రి, శ్రీరామ నవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు, గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, దహన సంస్కారాలకు రూ.10వేలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానంటూ మొత్తం 15 హామీలను తన మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించాడు. ఇదిలా ఉండగా మరోవైపు గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపరం గ్రామంలో ఆంజనేయులు అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు.తనను గెలిపిస్తే తాను అమలు చేసే 22 హామీలతో మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి, ఈ హామీలను అమలు చేయకపోతే పదవి నుండి తప్పుకుంటానని బాండ్ పేపర్లో పేర్కొన్నాడు.  ఇక సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలో ఉన్న గుడితండ గ్రామంలో గుగులోతు జయపాల్ నాయక్ అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు... గుడితండ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా నన్ను ఎన్నుకుంటే నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఎంత సంపాదించినా... కూడా అలా పెరిగిన వాటిని గ్రామపంచాయతీ జప్తి చేసి ప్రజలకు పంచవచ్చునని తెలియజేస్తూ.. ఈ బాండ్ పేపర్ మీద రాసి మీ అందరి చేతుల్లో పెడుతున్నాను.  పనులు చేయడానికే ప్రజల దగ్గరికి వచ్చాను. గ్రామపంచాయతీ సొమ్మును అక్రమంగా వాడుకోను అంటూ హామీతో కూడిన మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చారు... అనేక గ్రామాల్లో అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లు కారణంగా, వారు ఇచ్చే హామీల కారణంగా, వేలం పాట ద్వారా గ్రామస్తు లందరూ కలిస సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటు న్నారు.  ఇలా అనేక గ్రామాల్లో నివాసముంటున్న గ్రామ ప్రజలు ఆదిలాబాద్ జిల్లాలో 22 మంది, నిజామాబాద్ జిల్లాలో 10 మంది, కామారెడ్డిలో 5 మంది, నిర్మల్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 6 మంది, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5 మంది, మహబూబాబాద్ జిల్లాలో 3 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2 మంది, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు...నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న ఆడిశర్లపల్లి గ్రామంలో, గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామంలో దేవాలయం నిర్మిస్తామని చెప్పిన అభ్యర్థులను కూడా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

చిక్కుల్లో వల్లభనేని వంశీ.. విషయమేంటంటే?

వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయినట్లేనా అంటే తాజాగా జరిగిన పరిణామంతో పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ.. అసెంబ్లీకి ఎన్నికైన రెండు సార్లూ కూడా తెలుగుదేశం అభ్యర్థిగానే విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైన సందర్భంలో వల్లభనేని వంశీ అవకాశవాదిగా మారి వైసీపీ పంచన చేరారు. రాజకీయాలలో పార్టీలు మారడం అసాధారణమేమీ కాదు. అయితే పార్టీ మారిన తరువాత మాత్రం ఆయన వ్యవహార శైలి అసాధారణంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.  ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వంశీ స్వయంగా గన్నవరం నుంచి ఓడిపోయారు. వైసీపీ హవా కొనసాగిన కాలంలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి దూరం కావడంతో పరాజయం పాలై మాజీ అయిపోయారు. అయితే గతంలో చేసిన తప్పులు వదలవుగా.. ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదుగా? అందుకే వైసీపీ అండ చూసుకుని చెలరేగిపోయి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వంశీకి ఆ కేసులు చుట్టుముట్టాయి. దాడులు, దౌర్జన్యాలు, మోసం, కబ్జా ఇలా పలు ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు వంశీపై ఉన్నాయి. వీటిల్లో గన్నవరం తెలుగుదేశం కార్యాలంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ అరెస్టై ఏకంగా 137 రోజులు రిమాండ్ ఖైదీలో కటకటాల వెనుక గడిపి బెయిలుపై బయటకు వచ్చారు.  అయితే తాజాగా అదే కేసులో నిందితులై ఇంత కాలం పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరులలో ఇద్దరిని కోర్టు రిమాండ్ కు పంపింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారీలో ఉన్నవంశీ అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాముపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో వారిరువురూ ఆ వారెంట్ వెనక్కు తీసుకోవాలని కోరుతూ  విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ఇరువురూ కోర్టులో సరెండర్ అయ్యారు. వారి అభ్యర్థనపై విచారణ జరిపిన కోర్టు విచారణ పూర్తయిన  తరువాత వారిరువురినీ ఈ నెల 15 వరకూ రిమాండ్ కు పంపిసతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిరువురినీ కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇంకా నలుగురు పరారీలోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇరువురిని కోర్టు రిమాండ్ కు పంపడంతో ఈ కేసులో బెయిలుపై ఉన్న వంశీకి కూడా చిక్కులు తప్పవని అంటున్నారు.  ఈ ఇరువురి అరెస్టు ప్రభావం బెయిలుపై ఉన్న వంశీపై పడటం ఖాయమంటున్నారు. 

వైసీపీ నుంచి విడదల రజనీ ఔట్?

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు విడదల రజనీ జగన్ కు ఝలక్ ఇవ్వనున్నారా? వైసీపీని వీడుతానంటూ పార్టీ అధినేతకు లీకులు పంపిస్తున్నారా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజినీ.. అప్పట్లో తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కను అంటూ చెప్పుకునే వారు. అయితే తరువాత ఆమె వైసీపీ గూటికి చేరి పలుకు మార్చారు. అసలింతకీ ఆమె పొలిటికల్ జర్నీ ఎలా సాగింది.. ఇప్పుడు వైసీపీ పట్ల ఆమెకు ఎందుకు అంత విరక్తి కలిగిందన్నది చూస్తే...  2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విడదల రజినీ తెలుగు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడానికి తోడు మంచి వాక్చాతుర్యం  ఉండటంతో అనతి కాలంలోనే తెలుగుదేశం సీనియర్ల గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే  అప్పట్లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడే చాన్స్ పొందారు.  ఆ అవకాశం రజనికి పార్టీలో మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. అంతే కాకుండా..   హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్కను అంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ బాగా హత్తుకున్నాయి. అదే మహానాడు వేదికపై నుంచి అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిలను నరకాసురులుగా అభివర్ణించిన విడదల   రజినీ మాటలకు తెలుగు తమ్ముళ్లే కాదు, వేదికపైన ఉన్న పెద్దలు సైతం ఫిదా అయిపోయారు.   ఈ నేపథ్యంలో చిలకలూరి పేట సీటు కోసం విశ్వప్రయత్నం చేసిన విడదల రజినికి తెలుగుదేశం హైకమాండ్ నిష్కర్షగా నో చెప్పేసింది. దీంతో ఆమె  తెలుగుదేశం వీడి జగన్ పార్టీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఏకంగా మంత్రిపదవి సైతం చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చిలకలూరిపేట కేంద్రంగా రజనీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై పలు కేసులు సైతం ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికలలో తన ఘోర పరాజయానికి తనను చిలకలూరి పేట నుంచి గుంటూరుకు మార్చడమేనని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఓటమి తరువాత ఆమె మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. జగన్ ఆమె రిటర్న్ బ్యాక్ కు అనుమతించారో లేదో తెలియదు కానీ, 2029లో చిలకలూరి పేట నుంచే పోటీ చేయాలన్న ధృఢ నిశ్చయంతో ఆమె ఉన్నారంటారు ఆమె అనుచరులు. అయితే ఇప్పుడు తాజాగా ఆమెను రేపల్లె వైసీపీ ఇన్ చార్జ్ గా వెళ్లమని జగన్ ఆదేశించారనీ, అది ఇష్టం లేని రజినీ ఇక వైసీపీకి గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి కర్త, క్రియ, కర్మ అన్నీ రజినీ వర్గీయులేనని కూడా అంటున్నారు.రేపల్లె ప్రపోజల్ వచ్చినప్పటి నుంచీ రజినీ సైలంట్ అయిపోయారంటున్నారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమె వాయిస్ వినిపించడం లేదు. ఏ కార్యక్రమంలోనూ ఆమె కనిపించడం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇక పోతే వైసీపీకి గుడ్ బై చెప్పి విడదల రజిని చేరే పార్టీ ఏదన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  జనసేన, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతున్నా.. అదేం జరిగే పని కాదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు.. అలా వెలగడానికి కారణం ప్రత్యర్థులపై ఇష్టారీతిన ఆరోపణలు, విమర్శలూ గుప్పించడమే. అటువంటి వారిని ఇతర పార్టీలు చేర్చుకోవడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారని అంటున్నారు. ఆ రకంగా చూస్తే విడదల రజినికి కూటమి పార్టీల తలుపులు మూసుకుపోయినట్లేనని కూడా అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆమె వర్గీయులు చేస్తున్న పార్టీ మార్పు ప్రచారం.. జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి చిలకలూరిపేటలో కొనసాగడానికే అయి ఉంటుందన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 

చంద్రబాబు కాదు.. చిన్నబాబే!

ఇంతై.. ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా రాజకీయంగా, వ్యక్తిగా నారా లోకేష్ రోజు రోజుకూ ఎదుగుతున్నారు. తండ్రి చాటు బిడ్డగా, ఆయన చిటికిన వేలు పట్టుకుని రాజకీయాలలో బుడిబుడి అడుగులు ఆరంభించిన లోకేష్ ఇప్పుడు తండ్రితో సమానంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాధాన్యత, అధికార పరిధి విస్తరణ వేగంగా పెరుగుతోంది. పార్టీలో నవతరం నాయకుడిగా  నారా లోకేష్ తనను తాను నిరూపించుకోవడమే కాకుండా పార్టీ నేతలు, శ్రేణుల నుంచి మద్దతు కూడా పొందుతున్నారు. పార్టీ వ్యవహారాలలో ఆయన పోషిస్తున్న కీలక పాత్ర పరిధి విస్తృతి చంద్రబాబుతో సమానంగా మారుతోందనడానికి ఇటీవలి కాలంలో పలు తార్కానాలు కనిపించాయి. గతంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కు తీసుకురావడంలో కానీ.. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణలో కానీ గతంలో చంద్రబాబు ఏ విధంగా క్రియాశీలంగా వ్యవహరించారో తెలిసిందే. ఇప్పుడు ఆ పనిని అంతే సమర్థతతో.. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అన్నట్లుగా లోకేష్ నిర్వహిస్తున్నారు.  అంతే కాదు జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కు మంచి గుర్తింపు లభిస్తోంది.   కేంద్రంతో సంబంధాల విషయంలో కానీ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అంశంలో కానీ లోకేష్ ను తండ్రిని మించిన తనయుడిగా పార్టీ నేతలూ, శ్రేణులే కాదు, పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు.    ఇహ ఇప్పుడు తాజాగా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ లతో భేటీ అవుతారు. ఈ భేటీలలో ఆయన ఇటీవలి మొంథా తుపాను కారణంగా రాష్ట్రానికి జరిగిన ఆస్తినష్టాన్ని, రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్నీ వారికి వివరిస్తారు. అందుకు సంబంధించిన నివేదికలు సమర్పిస్తారు. కేంద్రం నుంచి సహాయాన్ని కోరతారు. సాధారణంగా ఇలా కేంద్రానికి విజ్ణప్తులు చేయడం, ప్రకృతివిపత్తుల కారణంగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని వివరించి సహాయం కోరడం అన్నది ముఖ్యమంత్రి చేస్తారు. అయితే ఇప్పుడు ఆ బాధ్యత లోకేష్ తీసుకున్నారు.   అంతే కాదు.. పార్లమెంటులో తెలుగుదేశం సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తే విషయంలో లోకేష్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలోనూ, కూటమి ప్రభుత్వంలోనూ లోకేష్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతను కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. అంతగా ఆయన తన సమర్ధతతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

వైసీపీ ఫ్రాడ్ బ్రాండ్స్!

వైసీపీ ఒక క్రిమిన‌ల్ గ్యాంగ్ అని చెప్ప‌డానికి ఇప్ప‌టికే ఆ పార్టీ అధినేత నుంచి ర‌ప్పా  ర‌ప్పా ఫ్లెక్సీలు ప‌ట్టుకు తిరిగే కేడ‌ర్ వ‌ర‌కూ అందరూ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్న రీతిలో రుజువు చేసేశారు. జగన్ ఆస్తుల కేసులలో, ఆ పార్టీ నేతలు ఏపీ మద్యంస్కాం, కల్తీమద్యం కుంభకోణం, భూ కబ్జాలు వంటి ఎన్నో నేరాలలో కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు కటకటాల వెనుక ఉన్నారు. ఇది చాలు  ఆ పార్టీ ఒక క్రిమినల్స్ గ్యాంగ్ అని చెప్పడానికి అంటున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.   ఇప్పుడు తాజాగా వైసీపీలో   లేడీ  డాన్స్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వస్తోందంటున్నారు.  మొన్నటికి మొన్న నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్య‌వ‌హారం. ఇప్పుడు తాజాగా అదే నెల్లూరు జిల్లాకు, చెందిన అర‌వ కామాక్షి కేసు. అరవ కామాక్షి అయితే  ఏకంగా గంజాయి దందా నిర్వ‌హిస్తూన్నట్లు పోలీసులు చెబుతున్నారు.   అర‌వ కామాక్షి చేసే గంజాయి దందాను  అరిక‌ట్టాల‌ని పోరాటం చేస్తున్న    పెంచల‌య్య‌ అనే వ్యక్తిని వెంటాడి, వేటాడి మరీ హత్య చేసింది కామాక్షి గ్యాంగ్ అని పెంచలయ్య హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. త‌న గంజాయి దందాకు  పెంచ‌ల‌య్య‌ ఆడ్డు వ‌స్తున్నాడ‌న్న కారణంగా  అత‌డ్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న కామాక్షి గ్యాంగ్ చివరకు పెంచలయ్య త‌న బిడ్డ‌ను స్కూలు నుంచి తీసుకొస్తుండ‌గా  కాపు కాచి మరీ ఖతం చేశారని చెబుతున్నారు.   ఈ హత్య ఘటనను కూడా వైసీపీయులు రాజకీయ ప్రత్యర్థులపై నెట్టేయడానికి ప్రయత్నించారు. దీనిపై  రియాక్టైన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. ఒక వేళ నాపై సీపీఏం  నేత‌లు కేసు పెడితే తాను వారు విధించే శిక్ష‌ను ఎదుర్కుంటాన‌న్నారు. వాస్తవానికి   అర‌వ కామాక్షికి ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి వ‌ర్గానికి  ఎంతో సంబంధ‌ముంద‌ని ఆరోపించారాయ‌న‌.  ఇటీవల  జ‌గ‌న్ నెల్లూరు వ‌చ్చిన‌పుడు ఇదే అర‌వ కామాక్షి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు  ఖ‌ర్చుల కోసం ఇచ్చింది నిజం కాదా?  అని ప్రశ్నించారు. ఆమెకూ వైసీపీ నేత‌ల‌కు అంత‌టి సంబంధ బాంధ‌వ్యాలున్నాయి కనుకే..   విజ‌య్ కుమార్ రెడ్డి, పెంచ‌ల‌య్య కుటుంబాన్ని  ప‌ర‌మార్శించ‌డానికి రాలేద‌న్నారు కోటంరెడ్డి. ఇదంతా ఇలా ఉంటే వైసీపీ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడే గ్యాంగ్ ను తయారు చేసిందనీ, అది చాలదన్నట్లు ఇప్పుడు ఒక అరుణ‌, ఒక అర‌వ కామాక్షి వంటి ఫ్రాడ్ బ్రాండ్స్ ని కూడా రంగంలోకి దింపిందనీ విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  

సర్ పై చర్చకు విపక్షాల పట్టు.. సభలో గందరగోళం.. వాయిదా

పార్లమెంట్  ఉభయ సభలూ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమయ్యాయి.  లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే  ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి.  ఈ సమావేశాలలో  14 కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే,    ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సంసిద్ధమయ్యాయి.  ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.  లోక్ సభలో   ఓటర్ల జాబితా సవరణ సర్ పై  చర్చించాలంటూ  కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక పోతే..  ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన రాధాకృష్ణన్   రాజ్యసభ సమావేశాలకు తొలి సారిగా అధ్యక్షత వహిస్తున్నారు.   ఈ రోజు ఆరంభమైన పార్లమెంటు సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి.   ఇలా ఉండగా పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విపక్షలపై విమర్శలు గుప్పించారు.  సభలో నినాదాలు చేసి, సభా కార్యక్రమాలను అడ్డుకుని విలువైన సభా సమయాన్ని వృధా చేయవద్దంటూ విపక్షాలకు సూచించారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయన్న ఆయన, పార్లమెంటును  విధాన రూపకల్పనకు పరిమితం చేయాలన్నారు. నినాదాలతో సభను అడ్డుకుని విపక్షాలు డ్రామా అడుతున్నాయని విమర్శించారు.  పార్లమెంటు  సమావేశాలు కేవలం సంప్రదాయం కాదనీ, దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపే ప్రయత్నాలకు నవ శక్తిని ఇచ్చే మార్గమని అన్నారు.   కాగా  వయనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రా మోడీ వ్యాఖ్యలకు లోక్ సభలో గట్టి రిటార్డ్ ఇచ్చారు. పార్లమెంటు ప్రజా సమస్యలను చర్చించే వేదిక అని పేర్కొన్న ఆమె..  సభలో  చర్చకు అవకాశం ఇవ్వకుండా  అధికార పక్షమే నాటకాలు ఆడుతోందని విమర్శించారు.  ఇలా ఉండగా లోక్ సభ ఇలా ప్రారంభమై అలా కొద్ది సేపటికే వాయిదా పడింది. మొదటి రోజే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సర్ పై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు నిరసనకు దిగాయి.  సభ్యుల నినాదాలతో సభలో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.   

మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు!

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పోలీసులకు ఇప్పుడు మంత్రుల వ్యక్తిగత సహాయకుల నేరాల దర్యాప్తు, విచారణ అదనపు భారంగా మారుతోంది.   గ‌తంలో హోం మంత్రి అనిత పిఏ జ‌గ‌దీశ్ ఆగ‌డాలపై ఏకంగా కూట‌మి నేత‌లే ఫిర్యాదు చేశారు  అత‌గా డి సెటిల్మెంట్ల వ్యవహారం చూసి తెలుగు తమ్ముళ్లే విస్తుపోయారు.   ఏకంగా మంత్రి పీఏగా ఉంటూ..   వైసీపీ లీడ‌ర్ల‌ల‌కు ప‌నులు చేసి పెట్ట‌డంపై అతడిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..  హోం మంత్రి అనిత‌ అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.  తాజాగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికార వ్యక్తిగత సహాయకుడు సతీష్ వ్యవహారం తెరపైకి వచ్చింది. మహిళపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య మెసేజీలతో వేధింపులకు గురి చేసిన ఉదంతం కలకలం రేపింది.  అతడి వైధింపులు భరించలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన సీఎంవో.. అతడిని తొలగించి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   అయితే ఈ వ్యవహారంపై గుమ్మడి సంధ్యారాణి లక్ష్యంగా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి అయితే.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖా  మంత్రిగా ఉన్న సంధ్యారాణి ఒక మ‌హిళ ఆవేద‌న అర్ధం చేసుకోక పోగా.. త‌న పీఏకి వంతపాడుతున్నారని విరుచుకుపడ్డారు.   మంత్రి సంధ్యారాణికి త‌న గోడు వెళ్ల‌బోసుకుంటే, ఆమె  రివ‌ర్స్ లో త‌న‌పైనే దుర్భాష లాడార‌ని  బాధితురాలు వాపోయిన సంగతిని పుష్ప శ్రీవాణి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఆమెకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదనీ, రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.