భూగర్భ జలాలు పెంచాం... చంద్రబాబు
posted on Mar 20, 2015 @ 3:04PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కరువు తీవ్రతను ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉందని అన్నారు. అనంతపురానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకెళ్లామని, భూగర్భ జలాలు పెంచామని చెప్పారు. రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు కూడా వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చూపించామని, 415 ప్రైవేటు బోర్ వెల్స్ తీసుకుని నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పధకాల ద్వారా కరువు మండలాల్లో పని దినాలు పెంచామని చెప్పారు. పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటికి రూ. 3కే కిలో ఎండుగడ్డి, రూ. 8కే పశువుల దాణా సరఫరాచేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.