ఫ్రెంచ్ రచయిత్రి ఎర్నాక్స్‌కు సాహిత్య నోబెల్
posted on Oct 6, 2022 @ 5:48PM
ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నాక్స్ ఈ ఏడాది సాహిత్య నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 82 ఏళ్ల ఎర్నాక్స్ ధైర్యం, ప్రయోగాలతో వ్యక్తిగత జ్ఞాపకాలకు అడ్డుగా నిలుచున్న సామూహిక బంధనాలను చీల్చుకుంటూ మూలాలు, వేరుపడి ఉండటానికి సంబంధించిన విషయాలను ఆవిష్కరించారని నోబెల్ జ్యూరీ పేర్కొంది.
1940లో వెటోట్ అనే చిన్న పట్టణంలో నార్మండీ తెగలో ఆనీ ఎర్నాక్స్ జన్మించారు. ఆమె తన మూలాలు, నార్మన్ తెగ మూలాల గురించి భిన్న కోణాలు, పార్శ్వాలను గురించి సంబంధించిన తన వ్యక్తిగత అను భవాలు, ఆవిష్కరించిన కోణాలను ఆమె అక్షరబద్ధం చేశారు. వాటిని నవలలుగా రచించారు. రచయిత్రిగా ఆమె ప్రయాణం సుదీర్ఘమైనది అని నోబెల్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది.