నటి అంజలి కష్టాలు తీరేనా
posted on Apr 15, 2013 @ 9:07PM
సినీనటి అంజలి ఎట్టకేలకు తన 5రోజుల అజ్ఞాతవాసం ముగించుకొని మళ్ళీ కెమెరాల ముందుకు వచ్చింది. ఇక ముందు కేవలం తన సినిమా కెరీర్ మీదనే దృష్టి పెడతానని, ఇంతవరకు ఒప్పుకొన్న అన్ని సినిమాలను పూర్తి చేస్తానని ఆమె హామీ ఇచ్చింది. ఇక నుండి తన జీవితం, తన సినిమా కెరీర్ తన చేతుల్లోనే ఉంటుందని కూడా ఆమె అనడం చూస్తే, ఇక ఎవరి పెత్తననం అంగీకరించనని ఆమె చెప్పిందనుకోవచ్చును.
కానీ, ఆమె తన డబ్బు కాజేశాడని ఆరోపించిన తమిళ దర్శకుడు కలంజియణ్ తోనే ‘ఊర్ శూత్రి పురాణం’అనే తమిళ సినిమాలోకలిసి నటించడానికి ఒక అగ్రిమెంటు మీద సంతకం చేసి, కాల్షీట్స్ కూడా ఇచ్చింది. ఇన్ని గొడవలు, ఆరోపణలు, కోర్టు కేసులు జరిగిన తరువాత ఇప్పుడు అతనితో కలిసి నటించడం అంజలికి కష్టమే. నటించకపోతే కోర్టుకీడుస్తానని అతను ముందే హెచ్చరిస్తున్నాడు. ఈ సమస్యని అంజలి ఏవిధంగా పరిష్కరించుకొంటుందో, ఈ విషయంలో ఆమెకు ఎవరు సహాయపడతారో తెలియదు కానీ, ఆమె కష్టాలు ఇప్పుడప్పుడే తీరేట్లు లేవు.