నన్నుఏటియం కార్డులా వాడుకున్నారు: నటి అంజలి
posted on Apr 9, 2013 @ 12:18PM
కోలీవుడ్ నుండి తెలుగు సినీమాలలోకి జర్నీ చేసి వచ్చిన సినీ నటి అంజలి సీతమ్మవాకిట్లో అడుగుపెట్టినప్పటి నుండి మంచి పేరే సంపాదించుకొంది. అయితే ఆమె కూడా సీతమ్మవారి కష్టాలు తప్పలేదు. సినీ పరిశ్రమలో హీరోయిన్లు తమ కుటుంబ సభ్యుల వలన తరచూ ఎదుర్కొనే సమస్యే ఇప్పుడు అంజలి కూడా ఎదుర్కొంటోంది.
"ఇంతవరకు నన్ను అంటిపెట్టుకొని ఉండే ‘భారతి’ అందరు అనుకొంటున్నట్లు నా తల్లి కాదు. ఆమె నాకు పిన్ని అవుతుంది. ఆంద్రాలో నివసిస్తున్నఆమెను, ఆమె కుటుంబ సభ్యులను నేను స్వయంగా చెన్నై తీసుకువచ్చిఅనేక విధాల సహాయం చేసినప్పటికీ, వారు నన్నే మోసం చేసి నా సంపాదన అంతా దోచుకోన్నారు. చివరికి ఖర్చులుకి కూడా నా చేతిలో పైసా లేకుండా చేసారు. వారితో తమిళ దర్శకుడు కలంజియం కూడా చేతులు కలిపి అందరూ కలిసి నా సంపాదన మొత్తం దోచుకోవడమే కాకుండా నా వెనుక కుట్రలు పన్నుతున్నారు. వారు నన్నొక డబ్బు ఇచ్చే ఏటియం కార్డులా వాడుకోన్నారు. నా పిన్నిభారతి, ఆమె కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను నా అన్నతో, అక్కతోగానీ మాట్లాడనీయకుండా కట్టడి చేసేవారు. ఇక వారి ఆగడాలు భరించలేక నేను హైదరాబాదులో స్థిర పడదామని వచ్చేసాను. అక్కడే ఉంటే వారి వల్ల నాకు ప్రాణ హాని కూడా ఉంది. అయినప్పటికీ, వారు నన్ను వదిలిపెట్టలేదు. నాకు ఒక దర్శకుడితో సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక నా సినిమా కెరీర్ పైనే దృష్టి పెట్టి మళ్ళీ నిలదొక్కుకోవాలని అనుకొంటున్నాను. మళ్ళీ నేను కష్టపడి సంపాదించుకోగలననే దైర్యం నాకు ఉంది. నా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి,” అని అంజలి మీడియాకు తెలిపింది.
ఆమె చేస్తున్న ఆరోపణలకు దర్శకుడు కలంజియం ప్రతిస్పందిస్తూ ఆమెను సినీపరిశ్రమకు నేనే పరిచయం చేసాను. ఆమె బాగుపడాలని కోరుకొనే వారిలో నేను మొదటివాడిని,. అంజలి ఇంకా మంచి చెడు తెలియని చిన్నపిల్ల. పబ్బులకు పార్టీలకు వెళతానని ఆమె అన్నప్పుడు మేము అది మంచిది కాదని చెప్పడం ఆమెకు కోపం తెప్పించింది. అన్నివిషయాలు ఆమెకే క్రమంగా అర్ధం అవడం మొదలయితే అప్పుడు మేము చెప్పినదానిలో తప్పు లేదనితెలుసుకొంటుంది,” అని అన్నారు.
ఇప్పుడే అందిన వార్త: అంజలి నిన్న ఉదయం నుండి కనిపించట్లేదని, ఆమె సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందని, ఆమె సోదరుడు కొద్దిసేపటి క్రితం మీడియాకు తెలిపారు.