స్పీకర్‌పై నోరు జారిన జగన్
posted on Mar 11, 2015 @ 12:14PM
వైసీపీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ అసెంబ్లీలో మైకు ముందు నిలబడితే తానేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. బుధవారం నాడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ స్పీకర్ మీద నోరు జారారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం మీద ఆకాశమే హద్దుగా మాట్లాడవచ్చని, అయితే తాము ఏం మాట్లాడాలో స్పీకర్ నిర్దేశిస్తున్నారని, స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు తటస్థంగా వ్యవహరించడం లేదని, స్పీకర్ స్థానంలో తెలుగుదేశం శాసనసభ్యుడు కూర్చున్నట్టుగా వుందని వ్యాఖ్యానించారు. ఒక గౌరవనీయమైన స్థానంలో వున్న స్పీకర్ మీద జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీద సభలో వున్న తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.