ఆసుపత్రిలో అమితాబ్.. ఎందుకంటే?
posted on Aug 24, 2022 @ 12:04PM
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాననీ, ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారన్న సంగతి తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇలా ఉండగా అమితాబ్ కరోనా బారిన పడటం ఇది రెండో సారి. మొదటి సారి 2020లో అమితాబ్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఆయన కుటుంబంలో కుమారుడు, కోడలు, మనవరాలు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. అమితాబ్ ప్రస్తుతం ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ 14వ సీజన్ షూటింగులో ఉన్నారు. అలాగే, ఆయన కీలక పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే, ‘గుడ్‌బై’, ‘ఊంచాయి’ సినిమాల్లోనూ అమితాబ్ నటిస్తున్నారు.