చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం
posted on Oct 3, 2025 @ 2:15PM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేడ్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం దేవళంపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు ఆందోళనకు దిగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు వైసీపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మద్దతు పలికారు.
కాగా అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారు, నిందితులను కఠానంగా శిక్షిస్తామన్నరు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దేవళంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాని కొందరు దుండగులు గురువారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో విగ్రహం పాక్సికంగా దెబ్బతింది.
విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అండేడ్కర్ విగ్రహానికి అపచారం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీరియస్ అయ్యారు. దోషులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.