అంబరీష్ రజనీకాంత్‌ని ఇష్యూలోకి ఎందుకు లాగినట్టో?
posted on Jul 17, 2014 @ 11:04PM
కన్నడ నటుడు, కర్ణాటక మంత్రి అంబరీష్ అనారోగ్యం కర్నాటకలో రాజకీయ దుమారం రేగటానికి కారణమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ సింగపూర్‌కి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి కాబట్టి ఆ బిల్లును ప్రభుత్వానికి ఇచ్చాడు. ప్రభుత్వం ఆ బిల్లు మొత్తాన్నీ అణా పైసలతో సహా చెల్లించేసింది. అయితే అంబరీష్ చేసిన బిల్లు ఎంతయ్యా అంటే, అక్షరాలా కోటి పదహారు లక్షలు. అయితే నిబంధనల ప్రకారం ఒక మంత్రి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఏడు లక్షలు మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. మరి అంబరీష్ ఏకంగా కోటి 16 లక్షలు ఖర్చు చేశారని ప్రతిపక్షాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీద విరుచుకుపడుతున్నాయి. ఇదిలా వుంటే ప్రముఖ నటుడు రజనీకాంత్ చెప్పడం వల్లే తాను సింగపూర్ వెళ్ళి వైద్యం చేయించుకోగలిగానని అబరీష్ అమాయకుడిలా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంబరీష్ లాంటి ప్రముఖ నటుడికి, కర్ణాటకలో బోలెడంతమంది అభిమానులు వున్న వ్యక్తికి తన వ్యాధికి ఎక్కడ చికిత్స చేయించుకోవాలో కూడా తెలియదా అనుకుంటున్నారు.