అమరావతి బ్రాండ్ పైలాన్
posted on May 1, 2025 @ 10:41PM
అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని మొదటి అక్షరం ‘ఏ’ ఆకారంలో 20 అడుగుల పైలాన్ ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ ను ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. బహిరంగ సభ వెనుక వైపున ఏర్పాటు చేసిన ఈ పైలాన్ ను పూర్తిగా గ్రానైట్ స్టోన్స్ తో నిర్మించారు.
ఈ పైలాన్ మధ్యలో ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబు తదితరుల పేర్లు చెక్కారు. ఈ పైలాన్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమరావతి రీలాంచ్ సందర్భంగా దాదాపు లక్ష కోట్ల విలువైన పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక సభలో ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, గవర్నర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా 14 మంది ఆసీనులవుతారు. సభా వేదికకు ఎదురుగా అమరావతి రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం మొత్తాన్నీ ఎస్పీజీ గురువారం మధ్యాహ్నమే అధీనంలోకి తీసుకుంది.