లుకౌట్ ఎందుకు, ఢిల్లీలోనే ఉన్నా.. సిసోడియా
posted on Aug 22, 2022 @ 12:01PM
ఊళ్లో ఉన్న దొంగని పట్టుకోవడానికి విదేశాలకి వెళ్లి సమాచారం పట్టుకొచ్చాడట ఒకాయన వెనకటికి. తీరా చూస్తే పక్కవీధిలో పోలీసాయన ఆయన్ను స్టేషన్‌కి పిలిపించి అడ్రస్ రాసుకుని పంపించేశాట్ట. సీబీఐ అంతటి సంస్థ మనీష్ సిసోడియా దేశం విడిచి వెళ్లిందీ లేనిదీ తెలుసుకోకుండానే లుకౌట్ నోటీసు జారీ చేయడం కంటే హాస్యాస్పదం వేరొకటి ఉండదు. ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్న తనకు అలా నోటీ సులు ఇవ్వడం కేంద్రం ఓవరాక్షన్ అవుతుందని సిసోడియా ఘాటుగా స్పందించారు. సీబీఐ, ఈడీ తమ అధీ నంలో పెట్టుకుని ఎవరు ఎక్కడున్నదీ తెలుసుకోలేని స్థితిలో ఉండడం ఆశ్చర్యపరుస్తుందని ఆప్ అధి నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా విమర్శించారు.
అయితే.. అనంతరం దీనిపై సీబీఐ వివరణ ఇచ్చింది. ఇప్పటికైతే ఈ కేసులో ఎవరిపైనా లుకౌట్ నోటీసు జారీ చేయలేదని తేల్చిచెప్పింది. అందునా.. ప్రజాసేవకులు (ఈ కేసులో మంత్రి సిసోడియా) ప్రభుత్వాని కి తెలపకుండా దేశం విడిచి వెళ్లరు కాబట్టి, వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియా తో మాట్లాడుతూ, కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీఐని రాజకీ యంగా వాడుకోవడం ఇక నైనా ఆపాలని అన్నారు. కాగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ-కేజ్రీ మధ్యే పోరాటం జరుగుతుందన్న భయం బీజేపీలో ఉందని, అందుకే ఈ సీబీఐ దాడులు జరుగుతు న్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీ వల చేసిన వ్యాఖ్యల పై బీజేపీ స్పందించింది.
ఎక్సైజ్ విధానం కుంభకోణానికి సంబంధించి మూలాలన్నీ కేజ్రీవాల్ వేపే వెళుతున్నాయని ఆయనతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారని ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హెచ్చరించారు. అంతేగాక, ఈ కేసుతో సంబంధం ఉన్న డజను మంది స్టాండప్ కమెడి యన్లు, సోషల్ ఇన్‌ఫ్లూ యెన్సర్లు, యూట్యూబర్లను సీబీఐ దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం.
అలాగే, హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ మద్యం వ్యాపారుల ప్రమేయం, ఒకే ముంబై చిరునా మా ను కలిగి ఉండి.. అల్లిబిల్లిగా అల్లుకున్న కార్పొరేట్ సంస్థల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించి సీబీ ఐ వారిపై దృష్టి సారించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు (ఈ డీ) సీబీఐ అప్పగించినట్టు సమాచా రం. ఈడీ ఈ ఫైళ్లను పరిశీలించి.. మనీలాండరింగ్ జరిగిన సూచ నలు కనిపిస్తే కేసు నమోదు చేస్తుందని తెలుస్తోంది.