అసలే మాజీ ఎంపీ కొడుకు... పైగా తప్పతాగాడు...

 

చాలామంది ప్రజా ప్రజా ప్రతినిధుల పుత్ర రత్నాలు తప్పతాగి గొడవలకు దిగడం ఈమధ్య కాలంలో మామూలైపోయింది. చేతినిండా డబ్బు, ఊరు నిండా అధికారం.. ఇక చెప్పేదేముంది... భావిభారత రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సంఘటన మంగళవారం నాడు కూడా జరిగింది. ఓ మాజీ ఎంపీ కుమారుడు మంగళవారం అర్ధరాత్రి తప్పతాగి హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో హడావిడి చేశాడు. తప్పతాగి ఓ హెటల్‌కి వచ్చిన అతను బిర్యానీ పార్సిల్ విషయంలో హోటల్ సిబ్బందితో గొడవ పడ్డాడు. గొడవ ముదిరిపోవడంతో మద్యం బాటిళ్ళతో హోటల్ సిబ్బంది మీద దాడి చేశాడు. హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికొచ్చిన పోలీసులు అతన్ని అదుపు చేయబోగా, పోలీసుల మీద కూడా దాడి చేశాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తర్వాత ఏం జరుగుతుంది? పొలిటికల్ ప్రెజర్లు వస్తాయి.. అతన్ని విడిచిపెట్టేస్తారు. జనం టైమ్ బ్యాడ్ అయితే ఫ్యూచర్లో అతగాడు ఎంపీ కూడా అవుతాడు.

Teluguone gnews banner