Read more!

హేట్ స్పీచ్, ఆ గొంతు నాది కాదు: అక్బరుద్దీన్

 

 

 

 

నిర్మల్ బహిరంగ సభలో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన గొంతు తనది కాదని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసును ఎదుర్కుంటున్న అక్బరుద్దీన్ను పోలీసులు మంగళవారంనాడు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు విచారణ సాగింది.


"నిర్మల్ సభలో పాల్గొన్నది నేనే. అందులో కనిపిస్తున్నది నేనే. కానీ అందులో అన్న మాటలు నావి కావు. ఆ గొంతు నాది కాదు. నేను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు” అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరు్ద్దీన్ ఓవైసీ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ  వర్గం మనో భావాలు దెబ్బతీశారని ఆదిలాబాద్ జైలు లో ఉంటూ పోలీసు విచారణ ఎదుర్కొంటున్న అక్బరుద్దీన్ విచారణలో భాగంగా పోలీసులతో గొంతు నాది కాదని చెప్పడం తప్పించుకోవడానికే అని తెలుస్తోంది.



యూట్యూబ్ లో వచ్చే ప్రసంగాల వీడియోల ఆధారంగా కేసును రుజువు చేసే సాంకేతిక పరిజ్ఞానం మన వద్ద లేదన్న ధైర్యంతో ఆయన ఈ విధంగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ సంధర్భంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఓ గంట ముందే విచారణ నిలిపేశారు. ఆ తరువాత ఆరోగ్యం మెరుగుపడింది. అయితే మెరుగయిన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని ఆయన తరపు న్యాయవాదులు పోలీసులను కోరారు.