అక్బరుద్దీన్ కి వైద్య పరీక్షలు పూర్తి... అరెస్టు చేస్తారా?

 

 

 

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో సుమారు మూడు గంటల పాటు ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అక్బరుద్దీన్ శరీరంలో బుల్లెట్ ఉన్నందున ఎంఆర్ఐ స్కానింగ్ చేయలేదు. పొత్తికడుపులో నొప్పిగా ఉందని అక్బరుద్దీన్ వైద్యులకు తెలపడంతో… పొత్తికడుపు స్కానింగ్ పూర్తయిన తర్వాతనే వైద్య పరీక్షల నివేదికను వైద్యులు పోలీసులకు అందజేయనున్నారు. ప్రస్తుతం వైద్యుల నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆయనను అరెస్టు చేయాలా ? వద్దా ? అన్న నిర్ణయం దాని మీదనే ఆధారపడి ఉంది.

Teluguone gnews banner