అక్బరుద్దీన్ పై మరో కేసు
posted on Jan 17, 2013 @ 9:36AM
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన అక్బరుద్దీన్ పై మరో కేసు నమోదు అయ్యింది. 2005లో రోడ్డువెడల్పులో భాగంగా మసీదును కూల్చుతుండగా అప్పటి జిల్లా కలెక్టర్ ఆంజనేయులను దుర్బాషలాడిన ఆయనపై పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో పీటీ వారెంట్ జారీ అయ్యింది.
ఈ కేసులో నిందితులుగా వున్న 8మంది కోర్ట్ కు హాజరవుతున్నపటికి అక్బర్ మాత్రం కోర్ట్ కి హాజరుకావడంలేదు. ఈ కేసులో మెదక్ జిల్లా పోలీసులు ఆయన్ను ఎప్పుడో తమ కస్టడీలోకి తీసుకోవాల్సి వున్నపటికి అలా జరగలేదు. ఈ కేసు విషయమై సంగారెడ్డి పోలీసులు అక్బరుద్దీన్ ను తీసుకు వచ్చేందుకు నిర్మల్ వెళ్లారు. అన్నీ కుదిరితే ఈ రోజు అక్బర్ సంగారెడ్డి సెషన్ కోర్టులో హాజరావ్వచ్చు.
ఈ కేసులో అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ని౦దుతునిగా వున్నప్పటికీ ఆయన్ని అదుపులోకి తీసుకొని కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయడానికి పోలీసులు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.