కసబ్ కు ఉరి: భారత్ కు తాలిబన్ల హెచ్చరిక
posted on Nov 22, 2012 @ 4:39PM
తీవ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరి తీయడంతో భారత్‌కు తాలిబన్ల నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. గురువారం తాజాగా తాలిబన్లు ఓ హెచ్చరికను జారీ చేశారు. కసబ్ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని, భారతీయులపైనే తమ దాడులు ఉంటాయని హెచ్చరించారు. కసబ్ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటించిన విషయం తెలిసిందే.
తీవ్రవాది అయిన అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన నేపథ్యంలో ఆయన స్వగ్రామానికి మీడియా వెళ్లకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతానికి వెళ్ళి కసబ్‌కు సంబంధించిన వివరాలు సేకరించవద్దని పాక్ తెలిపింది. పాకిస్థాన్, పంజాబ్ ప్రావిన్స్‌లోని పరిద్గోట్ గ్రామం వ్యవసాయ కుటుంబంలో కసబ్ 1987వ సంవత్సరం జన్మించాడు. తన తండ్రితో తినుబండారాలను అమ్మే వ్యాపారం చేస్తూ వచ్చిన కసబ్‌కు.. బాలీవుడ్ సినిమాలు, కరాటే అంటే చాలా ఇష్టమట.