మృత్యుంజయుడు.. ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు

 

ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ మాలిక్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే  సీటు ఏ11 ప్రయాణికుడు నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రయాణికుడు 38ఏళ్ల రమేష్‌ పటేల్‌ అని తెలుస్తోంది.

విమానం కూలిన తర్వాత ఎమర్జెన్సీ గేటు నుంచి భయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే,మృతుల సంఖ్య గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ నివాస ప్రాంతంలో విమానం  కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’అని కమిషనర్ అన్నారు. కాగా అతనికి ఛాతీ, కన్ను, కాలికి గాయాలయ్యాయి. మృత్యుంజయుడగా ప్రమాదం నుంచి  ప్రాణాలతో బయటపడ్డాడు.
 

Teluguone gnews banner