ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు... లోక్‌సభ స్పీకర్‌గా అద్వానీ?
posted on May 14, 2014 @ 6:30PM
దేశ రాజకీయాలలో ఒకసారి చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. కేంద్రంలో ఎన్డీయే కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడగానే ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబునాయుడుని నియమించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే ప్రధానమంత్రి మోడీకే ఎన్డీయే కన్వీనర్ బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచన కూడా వుంది. అయితే చంద్రబాబు ఆ పదవికి సంపూర్ణంగా న్యాయం చేస్తారన్న అభిప్రాయం ఎన్డీయే పార్టీల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సీనియర్ నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వాలనేదానిమీద కూడా చర్చ జరుగుతోంది. సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వంటి నేతలకు అప్పగించే శాఖలు, బాధ్యతలపై బీజేపీలో అప్పుడే చర్చ మొదలైంది. అద్వానీని లోక్‌సభ స్పీకర్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కేంద్ర రక్షణ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ను నియమించే సూచనలు కనిపిస్తున్నాయి.