అసలు తప్పు తలిదండ్రులదే ..!! హోం మంత్రి ఉవాచ!
posted on Jun 9, 2022 @ 11:09AM
ఆడపిల్లలు, మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలూ ఇటీవల పెరిగిపోతున్నాయి. గత వారం రోజులు గా నానుతున్న జూబ్లీహిల్స్ కారులో రేప్ కేసులో నిందితుల సంగతి తెలిసి కొందరిని పట్టుకుని వారిలో అధిక భాగం మైనర్లే అని తేల్చి ఒకరిద్దరిని జ్యూవెనల్ హోమ్ కి తరలించేరు. అక్కడ బాగుబడి రమ్మని. అస లు నింది తులు మైనర్లేనట.
రాజకీయప్రముఖుల పిల్లలు నిందితుల్లో వున్నారని కేసు నానుస్తున్నారని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. పోలీసులు ఇంకా నీళ్లు నములుతూనే వున్నారు. ఈలోగా తెలంగాణా హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీగారు బుధవారం గొప్ప వ్యాఖ్యానం చేసేరు. మైనర్లు ఇంత ఘాతుకానికి ఒడిగట్టడ మేమిటి? దీనికి వారి తలిదండ్రులదే తప్పని! ఉరుము ఉరిమి ఇంటి మీద పడింది! పిల్లల పెంపకం, వారి చదువులు, నడవడిక అన్నీ తలిదండ్రులే చూసుకోవాలి. బాగానే వుంది. కానీ రోజు లు మారిపోయాయి. ఇపుడంతా మొబైల్ కాలం.
అన్నీ అందులోనే. పిల్లలకి, వుద్యోగులకూ కావలసిన సమాచారాలకు, సరదాలకూ మరో మార్గదర్శిగా మారిపోయింది మొబైల్. చదువుకు సంబంధించి, సరదాలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం కూడా దాని తోనే సాధ్యమవుతోంది. స్నేహాలు విస్తరిస్తున్నాయి. ఇందులో ఆడ, మగా తేడా లేదు. ఇపుడు ఇది ఓ పెద్ద ఫ్యాషన్! చేతిలో ఖరీదయిన మొబైల్ లేకపోయి నా, నలుగురితో ఏకకాలంలో చాటింగ్ లేక పోయినా కూడా ఇప్పటి యూత్ వారిని వెలివేసి నంత పని చేస్తున్నారు. అన్ని రకాల సమాచారాలు, సినిమాలు, విధ్వంసక దృశ్యాలు, మానసిక దౌర్బల్యా ల ప్రేరకాలు కూడా అదే ప్రసాదిస్తున్న కాలంలో యువతను కాపాడుకో వడం తలిదండ్రులకు కత్తి మీద సాముగానే మారింది. అయితే ఇది ఎంతవరకూ కట్టడి చేయ గల్గుతారు? బడికి, కాలేజీకి, వుద్యోగా నికి వెళ్లే ఆడపిల్లలకు రక్షణార్ధం అనేక సౌకర్యాలున్న మొబైల్ అందించక తప్పడం లేదని తలిదండ్రులే అంటు న్నారు. ఎప్పుడైనా సమస్య ఎదురయి నపుడు వెంటనే తెలిసి పరుగులు పెట్టడానికి వీలవుతుందట! కానీ ప్రభుత్వాలు,పోలీసు వ్యవస్థ అందిస్తున్న యాప్ లతోనే అమ్మాయిలకు రక్షణ లభిస్తుందంటే ఇంకేమి? ఘాతుకాలు, దాడులు తెలిసి జరగవు. హఠాత్తుగానే జరుగుతా యి.
వాటి నుంచి తప్పించు కోవ డానికి చేసే ప్రయత్నంలో తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలోనే ప్రాణం పోతున్నంత పని అవు తుంది గదా!
ఇటీవలి కాలంలో స్కూళ్లు, కాలేజీల్లో చేరుతున్న పిల్లలకు అనేకానేక జాగ్రత్తలు తలిదండ్రలు తీసుకుం టున్నారు. అయినా ఎక్కడోక్కడ, ఏదో రోజు, ఏదోక క్షణాన స్నేహితుడనే వాడో, తెలిసినవాడో, ఏకంగా టీచరో, ఆటోవాడో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతీఒక్కరం పక్కవాడిని చూసి భయం భయం గా బతికేయాల్సిన దారుణ కాలంలో బతకాల్సి వస్తోంది.
దారుణాలు జరిగినపుడల్లా పోలీసులు దాదాపు వెంటనే స్పందించడం, నిందితులను పట్టుకోవడం జరుగుతోంది. కానీ ఇటీవల పబ్‌ల చుట్టూనే ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోవడమే మరీ అన్యాయంగా మారింది. పబ్‌లకు వెళ్లడం,సరదాగా స్నేహితులతో గడపడం అనేది ఈ రోజుల్లో చాలా మామూలు సంగతి! కానీ తాగి కార్లు నడపడం, సరదాల్లో భాగంగా విచ్చలవిడిగా తిరగడం స్థాయి నుంచి ఇపుడు గంజాయి, మత్తు మందుల మత్తులో చిత్తయి జీవితాలు కోల్పోవడం సంఖ్య పెరుగుతూనే వుంది. అసలు పబ్‌లకు ఇస్తున్న స్వేచ్ఛ, లైసెన్స్‌లు గురించి పోలీసులు సీరియస్‌గా ఎందుకు తీసు కోరో అర్ధంగానిదేమీ లేదు. వాటి యజమానులో, మద్దతుదారులో రాజకీయరంగంలోనో, వ్యాపార రంగం లోనే బిగ్‌షాట్స్ అనే సమాచారంతో ఎవరికీ తొందపడి చర్య తీసుకోవడానికి కాళ్లూ చేతులు ఆడవు. ఫిర్యా దులు అలానే వుంటాయి.
ఆరోపణలన్నీ గోడమీద సున్నం.. అంతే! పబ్‌లకు వెళ్లినవారిలో సగం పైగా పిల్లలు ఇష్ట పూర్వకంగానే వెళుతుంటారు. బలవంతంగానో, స్నేహితుల మొహమాటంతోనో వెళ్లే వారు తక్కువ. అక్కడ సరదాలతో పాటు మద్యం మత్తులో విపరీత నిర్ణయాలు తీసుకోవడం, అందుకు కొందరు తోడ్పడడం జీవితాల్ని ఛిద్రం చేస్తున్నాయి. ఇందుకు అబ్బాయిలనేకాదు, అమ్మాయిలనూ తప్పు పట్టాల న్న ఆరోపణలూ వున్నాయి.
మొన్నటితో పబ్‌ల భాగోతాలకు స్వస్తి పలకాలన్న డిమాండ్ పెచ్చు మీరాయి. పబ్‌లు క్రమేపీ మత్తు పానీయాల కంటే గంజాయి వాడకానికి పెద్ద అడ్డాలుగా మారాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వింటు న్నాం. దీన్ని గురించి పోలీసులకు గట్టి సమాచారం లభించినా, దోషులను పట్టుకోవడంలో, వారిని కోర్టుకి లాగడం, శిక్షించడం వేగిరం జరగాలి. కానీ లేటెస్ట్ కేసులో మాత్రం ఇంకా నత్తనడకన సాగుతూనే వుంది. పైగా మంత్రి మనవడు వున్నాడన్న మాట బయటికి పొక్కడంతో పోలీసులు అతి జాగ్రత్తలు తీసుకుం టున్నారు. . నామ్‌కే వాస్తే ఒకరిద్దరిని అరెస్టు చేయడంతో బయటి నుంచి వస్తున్న ఆరోపణలను తట్టుకోవచ్చని అనుకున్నారు.
చిత్రమేమంటే ఇపుడు ఏకంగా హోంమంత్రి అలీ గారు గొప్ప జ్ఞానం బోధించేరు. అదేమంటే అసలు పిల్లల పెంపకమే అట్లా ఏడిచిందని. తలిదండ్రులు తమ పిల్లల సంరక్షణలో భాగంగా వారి నడవడికను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుండాలని బోధించేరు. కేసులో తమకి సంబంధించినవారు ఉన్నారన్నదానికి సమాధానంగా ఈ విధంగా కేసులో నిందితులను బయటికి పొక్కనీయకుండా ఈ విధమయిన స్టేట్‌మెంట్ల తో దారిమళ్లించే యత్నాలు, మర్చిపోయేట్టు చేసే యత్నాలు ఎంతవరకూ సమంజసమో ప్రభుత్వానికే తెలియాలి.