ఎబ్బే... తమన్నాకి ఇది కూడా రాదంట...!
posted on Dec 7, 2013 @ 11:38AM
మాములుగా ప్రతీ హీరోయిన్ కూడా ముందు మోడల్ రంగం నుంచే హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంటారు. మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలను పొందిన వారు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే మోడలింగ్ కూడా చేయకుండా హీరోయిన్లుగా మారినవాళ్లు ఉన్నారు. అయితే మోడల్ అయిన, హీరోయిన్ అయినా కూడా వారికీ అందంతో పాటు, అందమైన పిల్లి నడక కూడా తెలిసి ఉండాలి. అదేనండి క్యాట్ వాక్. ర్యాంప్ పై ఒయ్యారాలు పోతూ.. అలా అలా నడుస్తూ, చూసేవారి కళ్ళను ఆకర్షించాలి. అయితే ఇలాంటి క్యాట్ వాక్ హీరోయిన్ తమన్నాకు బొత్తిగా తెలియదు.
అయితే ఈ అమ్మడు ఉత్తరాదికి చెందిన ఓ వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఈ కంపెనీ పబ్లిసిటీలో భాగంగా యాడ్ ఫిలింలో తమన్నాను నటింపజేయాలనుకున్నారు సదరు షోరూమ్ యాజమాన్యం.ఈ యాడ్‌ఫిలింలో కంపెనీకి సంబంధించిన చీరలను ధరించి ర్యాంప్‌పై అందంగా తమన్నా క్యాట్‌వాక్ చేయాలి. కానీ తమన్నా మాత్రం ర్యాంప్‌పై క్యాట్ వాక్ కూడా చేయడం రాకపోవడంతో సదరు కంపెనీ వారు ఆశ్చర్యపోయారు.
తమన్నాకు క్యాట్‌వాక్ చేయడం చేతకాదని నిర్ధారించుకున్న ఆ యాజమాన్యం...క్యాట్ వాక్ ఎలా నడవాలో తమన్నాకి తెలియజేయడానికి ఓ ట్రయల్ వాక్‌ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎంత చేసిన కూడా మాములుగా నడుస్తుంది కాని, వాళ్ళు కోరుకున్న విధంగా క్యాట్ వాక్ లో నడవలేకపోయింది. దాంతో ఎదో ఒక విధంగా ఆ యాడ్ షూటింగ్ ను పూర్తి చేసేసారు.
కానీ ఈ విషయంపై తమన్నానే నోరు పారేసుకుందట. "నేనేమైనా మోడల్‌ని అనుకుంటున్నారా? నేను హీరోయిన్‌ని. ఇలాంటి చెత్త నడకలు నడవడం నాకు చేతకాదు. నేను ఇలాంటివి చేయను" అంటూ వాళ్లపై ఫైర్ అయ్యింది. దాంతో అక్కడున్నవారు ఏం చెయ్యాలో తెలియక ఎలాగోలా ఆ తతంగాన్ని ముగించేసారంట.