కృష్ణంరాజు పాడె మోసిన భార్య
posted on Sep 12, 2022 @ 5:18PM
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కన్ను మూశారు. ఆయన పార్ధివ దేహానికి సోమవారం మధ్యాన్నం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పార్ధివదేహాన్ని ఆయన సతీమణి శ్యామల మోయడం అంద రినీ కంటతడిపెట్టించింది.
మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహిం చారు. కృష్ణంరాజు పార్థీవదేహాన్ని అంతిమయాత్రగా తీసుకువచ్చారు. పార్ధివదేహన్ని ఆయన సతీమణి శ్యామల కూడా మోయడం అందరి నీ ఎంతో బాధపెట్టింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు పూర్తి చేశారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ రాజ్ చితికి నిప్పంటించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీ రుగా విలపించారు.
కృష్ణంరాజు కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ నివాసం ఉండేం దుకు ఓ ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. కానీ అది పూర్తి అవ్వకముందే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ముందుగా అనుకున్నట్లు మహాప్రస్థానంలో కాకుండా.. కృష్ణంరాజు నివాసం ఉండా లకున్న వ్యవ సాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అనా రోగ్యం కారణంగా ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు రెబల్ స్టార్‌ను చివరి సారి చూసేందుకు భారీగా తరలివచ్చారు.