అచ్చెన్నాయుడు కేసు.. అసలు గుట్టు వేరే ఉంది!!
posted on Jun 13, 2020 @ 4:01PM
ఈఎస్‌ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని, 150 కోట్ల స్కాం లో ఆయన పాత్ర ఉందని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కానీ, లోతుగా పరిశీలిస్తే ఏదైతే స్కాం జరిగిందని ఆరోపిస్తున్నారో దానిలో అచ్చెన్నాయుడి పాత్ర లేదని తెలుస్తోంది.
మొత్తం 150 కోట్ల స్కాం అంటున్నారు. నిజానికి ఇది మొత్తం 9 పార్టులు. 8 పార్టులకి సంభందించిన విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు రాలేదు. అందులో ఒక్క టెలీహెల్త్ సర్వీస్ లో మాత్రమే అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చాడని బయటకి చూపుతున్న ఆధారం. ఆ ఒక్క పార్ట్ కి సంబందించి.. రూ. 4-5 కోట్లైతే రూ.7.96 కోట్లు చెల్లించారనేది ఆరోపణ. అంటే అచ్చెన్నాయుడుకి సంబంధం ఉంది అంటున్న స్కాం విలువ 150 కోట్లు కాదు, 3 కోట్లు మాత్రమే.
ఇక ఈ 3 కోట్ల కి సంభందించి.. అచ్చెన్నాయుడు నవంబర్ 25 2016 న ఇచ్చిన లేఖని గమనిస్తే.. అందులో తెలంగాణ లో అమలు పరచిన విధంగా ఏపీలో అమలు పరచండి అని రాశారు. ఎందుకంటే ఇది ఏపీలో కొత్త సర్వీస్.. 2016 లో మోదీ మీటింగ్ పెట్టాక ఇంప్లిమెంట్ చేశారు. అలాగే, 2016 నవంబర్ 25 న లేఖ ఇచ్చిన అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత కార్మిక శాఖా మంత్రిగా ఉంది కేవలం 5 నెలలు మాత్రమే. 2017 ఏప్రిల్/ మే నుండి కార్మిక శాఖా మంత్రిగా పితాని వచ్చారు.
అలాగే, ఆ 3 కోట్లకి సంభందించి ఆ టెలీసర్వీసెస్ సంస్థకి లబ్దిచేకూరిస్తే.. అచ్చెన్నాయుడు లబ్దిపొందినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటకైతే చూపలేదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 3 కోట్ల అవకతవకలకి సంభందించి.. అది కూడా పక్క రాష్ట్రాల లాగా అమలు చెయ్యండని లేఖ మాత్రమే ఇచ్చి.. అందునా ఆ తర్వాత 5 నెలల్లో పదవి నుండి దిగిపోయి.. అందునా ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానన్న ప్రజాప్రతినిది.. అందులోనూ ఒక్కరోజు ముందే సర్జరీ అయిన అచ్చెన్నాయుడుని.. ఇలా గోడలు దూకి అరెస్ట్ చేయడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.