యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
posted on Feb 15, 2025 @ 9:45AM
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయడ్డారు. ఛత్తీస్ గఢ్ నుంచి కుంభమేళాకు భక్తులతో వెడుతున్న వాహనాన్ని ఓ ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మీర్జాపూర్, ప్రయాగ్ రాజ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన 19 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర దుర్ఘటనలో మరణించిన వారంతా ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు.
యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానం ఆచరించడానికి వెడుతున్న భక్తులు దుర్మరణం పాలు కావడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.