అన్యాయాన్ని ఆపిన సీసీటీవీ ఫుటేజ్...
posted on Oct 31, 2019 @ 1:07PM
విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు తప్పటడుగు వేశారు. తమ మాట లెక్క చేయటం లేదని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ టి తారకేష్ ను అక్కడి నుంచి బదిలీ చేయించేందుకు వారు పన్నిన కుట్ర సీసీటీవీలో రికార్డ్ అవడంతో గుట్టురట్టయిది. ఈ నెల తొమ్మిదిన ఏసీబీ అధికారులు మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ రోజు రికార్డు రూమ్ లో డాక్యుమెంట్ రైటర్ల దగ్గర 1.05 లక్షల నగదు దొరికిందని విశాఖ ఏసీబీ డిఎస్పీ కె రంగరాజు ప్రకటించారు. తారకేశ్వర్ విధులను వదిలేసి మధ్యలో వెళ్లిపోతున్నారని తమ దగ్గర ఆధారాలున్నాయని కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయాలన్నీ ఆ శాఖ ఉన్నతాధికారులకు పంపుతామని వారు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రబీంద్రనాథ్ సెలవులో ఉండడంతో వారు ఊహించినట్టు జరగలేదు. దీంతో ఆయన రాగానే పదునాలుగవ తేదీన ఇద్దరు ఏసిబి అధికారులు డీఐజీ కార్యాలయానికి వెళ్లారు. తారకేష్ ను అక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. ఏసిబి అధికారులు ఎదురుగా కూర్చొని ఒత్తిడి చేయడంతో ఆయన తారకేష్ ను అప్పటికప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేశారు. తనకు జరిగిన అన్యాయం పై తారకేష్ నేరుగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు సుదీర్ఘ లేఖ రాశారు.
ఏసిబి తనిఖీల రోజున కార్యాలయంలో సీసీ టీవీ ఫుటేజీని కూడా ఆ లేఖతో పంపించారు. దీంతో తారకేష్ ను బదిలీ చేయకూడదని డీఐజీ రవీంద్రనాథ్ ను మంత్రి ఆదేశించారు.అప్పటికే వార్తలు పత్రికల్లో వచ్చేశాయి. కానీ తారకేష్ ఆ కార్యాలయంలోనే ఇంకా పనిచేస్తుండటంతో ఏసీబీ అధికారులకు డాక్యుమెంట్ రైటర్ లకు మింగుడు పడడం లేదు. తారకేష్ దగ్గర భారీగా లంచం తీసుకొని బదిలీ ఆపేశారని కొంత మంది ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో మంత్రికి వాటా ఉందని ప్రచారం చేశారు. ఈ పంచాయతీ మొత్తం అమరావతికి చేరడంతో మంత్రి సీరియస్ అయ్యారు. డీఐజీ రవీంద్రనాథ్ కూడా ఏసీబీ అధికారులతో కుమ్మకైనట్లు భావించి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆకస్మిక తనిఖీలకు వచ్చిన ఏసీబీ సీఐ గఫూర్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కార్యాలయంలోని సీసీ టీవీ కెమెరాలను ఆపేయించారు. అయితే అవి ట్వంటీ ఫోర్ భై సెవన్ రికార్డు కెమెరాలూ ఆపినా ఆగవు ఆ విషయం వారికి తెలియక రికార్డింగ్ అవ్వడం లేదనుకొని వారికి నచ్చినట్టు వ్యవహరించారు. సీఐ గఫూర్ బయటకు వెళ్లి అక్కడ డాక్యుమెంట్ రైటర్ నారాయణరావు దగ్గర డబ్బులు తీసుకువచ్చారు. రికార్డుల గదిలో నుంచి ఓ కానిస్టేబుల్ తీసుకొచ్చిన ఓ పుస్తకంలో ఆ డబ్బు పెట్టించారు. నారాయణరావు అవినీతి చలామని అవ్వట్లేదనే తారకేష్ పై ఇంత దారుణానికి పాల్పడ్డాడు నారాయణరావు.ఇక పై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పై అధికారులు అదేశించారు.