అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ #aaram
posted on Jul 13, 2024 @ 12:58PM
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ మహోత్సవం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ మహోత్సవాలలో ఒకటిగా ఈ జంట పెళ్ళి నిలిచింది. బాడీ షేమింగ్ చేసే బుద్ధిలేని కుక్కలు ఎంత మొరిగినా, అనంత్, రాధికల జంట నిజంగానే చూడముచ్చటైన జంట. ఈ జంటకి తెలుగువన్ ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తోంది. అదే.. #aaram. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటను వాళ్ళ పేర్లలోని అక్షరాలను తీసుకుని ‘విరుష్క’ అన్నట్టుగా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంటను ‘ఆరామ్’ అనొచ్చు. Anant Ambani, RAdhika Merchent.. ఇలా ఇద్దరి పేర్లలోని అక్షరాలను తీసుకుని క్రియేట్ చేసిన హేష్‌టాగ్ #aaram. చూడముచ్చటగా వున్న ఈ జంట జీవితం ఆరామ్‌గా గడిచిపోవాలన్న సత్సంకల్పం కూడా ఈ హ్యాష్ ట్యాగ్ వెనుక వుంది.
ఇక మన #aaram పెళ్ళి వేడుకల విషయానికి వస్తే, అనంత్, రాధిక వివాహానికి తారాలోకం దిగి వచ్చింది. సెలబ్రిటీల సందడితో ముంబై నగరం మురిసింది. అంబానీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అతిథుల మధ్య అనంత్, రాధిక #aaram ప్రేమ బాసలు చేసుకున్నారు. ‘‘శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో మనిద్దరం కలసి మనం కలలు కంటున్నట్టుగా మన ఇంటిని నిర్మించుకుందామని నీకు ప్రామిస్ చేస్తున్నాను. మన ఇల్లు ఒక ప్రదేశం మాత్రమే కాదు.. మనం ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా అది ప్రేమతో నిండి వుంటుంది’’ అని అనంత్ అంబానీ తన భార్య రాధికకు భరోసా ఇచ్చారు. రాధిక కూడా అనంత్‌తో ‘‘మన ప్రేమ బంధం కలగలసిన ప్రాంతంగా మన ఇల్లు వుంటుంది’’ అన్నారు.
శుక్రవారం రాత్రి అనంత్, రాధిక ‘శుభవివాహం’ బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగింది. సినీ, రాజకీ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి సందడి చేశారు. అతిథులందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. సినీతారలు షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, రజనీకాంత్, మాధురీ దీక్షిత్ తమ డాన్స్.తో ఆకట్టుకున్నారు. శనివారం జరిగే ‘శుభ్ ఆశీర్వాద్’, ఆదివారం జరిగే రిసెప్షన్ ఇంకెంత భారీ స్థాయిలో వుంటాయోనన్న అంచనాలు వున్నాయి.