పేస్ బుక్ లవ్.. ఫేక్ లవ్..
posted on Mar 25, 2021 @ 12:02PM
ప్రేమ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అందుకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి వలలో పడి ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పరిచయం అయినా వారిని నమ్మి దారుణంగా మోసపోతున్నారు. అవసరానికి ఫ్రెండ్స్ అడిగిన, ఇంట్లో వాళ్ల్లు డబ్బులు అడిగిన వాళ్ళు కూడా, అమ్మాయిలు అడగానే డబ్బులు ఇస్తూ జోకర్లు అవుతూ మోసపోతున్నారు. తాజాగా ఒక అమ్మాయి సోషల్ మీడియా ని వేదిక చేసుకుని మోసాలకు పాలుపడింది.
నగర కమిషనరేట్ పరిధిలో రోజుకు మూడు నుంచి నాలుగు కేసులు సైబర్‌క్రైమ్స్‌లో నమోదవుతున్నాయి. పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ యువకుడు ఇలాగే మోసపోయి రూ.25వేలు అమ్మాయికి సదివించుకున్నాడు. ఎఫ్‌బీలో ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయానికి ముందు పెట్టుకున్న పేరు స్నేహం. తొండ ముదిరి ఊసర విల్లిగా మారినట్టు. వారి పరిచయం ముదిరి ప్రేమ అనే వాంఛతో ఆ అమ్మాయి ముగ్గులోకి దింపింది. ఇంకా అంతే మనోడు సొల్లు కారుస్తూ వెంట పడ్డాడు. పగుగెడుతున్న కాలం కదా పరిచయం అయినా రెండు రోజుల్లోనే న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునేంత వరకు తీసుకెళ్లింది వారి కథ. మొగాడు కదా మనోడోకి కొంచం తుత్తర ఎక్కువై. అమ్మాయి తనతో న్యూడ్‌గా వీడియోకాల్ మాట్లాడటంతో ఆడదాని చేతిలో కీలు బొమ్మ అనే సామెత నిజం చేసి ఆమె చెప్పినట్లే చేశాడు. ఆ వీడియోలను రికార్డ్ చేసిన యువతి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడంతో అడిగినంత సమర్పించుకున్నాడు. రెండోసారి కూడా మరో యాబైవేలు కావాలని డిమాండ్ చేయడంతో సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.
కాగా.. ఇలాంటి మాయదారి ఆడదాని వలలో పడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో ఏందో మంది ప్రముఖులు, రాజకీయ నేపథ్యం ఉన్నవారు, ఐటీ ఉద్యోగులు, సంపన్నులు ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి. అమ్మాయిలు కలిపే పులిహోరకు బలవుతూ గిలగిలా కొట్టుకుంటున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. నగ్న, అర్ధనగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడితే సమాజంలో ఎక్కడ చులకనైపోతామోనని భయపడి నేరగాళ్లు అడిగినంత డబ్బు ముట్టజెప్పుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం లేదని పోలీసులు అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.